AHA: ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమాలు, వెబ్ సీరిస్ లతో పాటు బోలెడన్ని ఇతర కార్యక్రమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. డాన్స్ తో పాటు సింగింగ్ రియాల్టీ షోనూ నిర్వహించిన ఆహా తాజాగా కామెడీ షోను ప్రారంభించింది. దీని ద్వారా వ్యూవర్స్ కు వినోదాల విందును వడ్డిస్తోంది. డిసెంబర్ 2న ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది.
వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంతో దిట్ట అనిపించుకున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఛైర్మన్ గా ఆహా ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే వచ్చిన కామెడీ షోకు పూర్తి భిన్నంగా ఆడియెన్స్ నే ఇన్వెస్టర్స్ గా మార్చుతూ ఈ షో సాగింది. ‘జబర్దస్త్’ తో చక్కని గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్న ‘సుడిగాలి’ సుధీర్, క్యూట్ బ్యూటీ దీపిక ఈ షోకు యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సరికొత్తగా డిజైన్ చేసినట్టు ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ ఛైర్మన్ అనిల్ రావిపూడి తెలిపాడు. ఇందులో అవినాశ్, రాజు, వేణు, హరి, భాస్కర్ అండ్ జ్ఞానేశ్వర్, సద్దాం ఆరు టీమ్స్ గా పాల్గొన్నారు. వాళ్ళు ఇండివిడ్యువల్ గా ఇచ్చే పెర్ఫార్మెన్స్ బట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఆడియెన్స్ యాప్ ద్వారా ఓట్లు వేశారు. అలా ఫస్ట్ రౌండ్ ‘స్కూల్ అండ్ కాలేజ్’ థీమ్ లో సద్దాం ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, పాత తెలుగు సామెతలను ఇంగ్లీష్ లో అనువదించే సెకండ్ ఎపిసోడ్ లో రాజు ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. మూడో రౌండ్ ‘ఇచ్చి పడేద్దాం’లో అందరూ కలిసి పాల్గొన్నారు. ఈ రౌండ్ లో ఇండివిడ్యువల్ గా వ్యూవర్స్ పార్టిసిపెంట్స్ కు మార్కులు వేశారు. ఈ మొత్తం మూడు రౌండ్స్ పూర్తయ్యే సరికీ ‘లాఫింగ్ స్టాక్ ఆఫ్ ది డే’గా అవినాశ్ ప్రధమస్థానంలో నిలిచాడు. ‘చిల్లెస్ట్ పెర్ఫార్మెన్స్’ కు సద్దాం ఎంపికయ్యాడు.
సద్దాం ఏడో ఎక్కాన్ని భిన్నంగా చెప్పి అందరినీ ఆకట్టుకుంటే, చంద్రబాబు, బాలయ్య బాబు వాయిస్ ను ఇమిటేట్ చేసి ముక్కు అవినాశ్ నవ్వులు పువ్వులు పూయించాడు. నటుడు వేణు సైతం మొదటి రౌండ్ లో మెప్పించాడు. అరవై నిమిషాలకు మించి సాగిన ఈ షో ఆద్యంతం నవ్విస్తూనే సాగి, అనిల్ రావిపూడి చెప్పినట్టుగానే ‘దిల్ సే నవ్వు కోండి… దిల్ కు మంచిది’ అనేది మాటను అక్షర సత్యం చేసింది. మరి రాబోయే రోజుల్లో ఈ కమెడియన్స్ ఏ స్థాయిలో వ్యూవర్స్ కు ఫన్ అందిస్తారో చూడాలి!