Ester Noronha: అగ్రస్థానంలో ఎస్తేర్ ‘ఐరావతం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ester Noronha: నటి ఎస్తేర్ నొరోహా ఇటీవల కాలంలో బోల్డ్ క్యారెక్టర్స్ తో కుర్రకారును కిర్రెక్కించింది. కానీ అందుకు పూర్తి భిన్నమైన పాత్రను ‘ఐరావతం’ మూవీలో చేసి మెప్పించింది. ఆమె కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో బుల్లితెర నటుడు అమర్ దీప్ చౌదరి, అరుణ్ ప్రధాన పాత్రలు పోషించగా, హీరోయిన్ తన్వీ నేగి ద్విపాత్రాభినయం చేసింది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. గుణశేఖర్ శిష్యుడైన సుహాస్ మీరా దీన్ని డైరెక్ట్ చేశారు. నూజివీడు టాకీస్ బ్యానర్ పై రేఖ పలగాని సమర్పణలో బాలయ్య చౌదరి, లలిత కుమారి తోట ఈ సినిమాను నిర్మించారు.
ఒక తెల్లటి కెమెరా చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ‘ఐరావతం’ మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రిక్కీ స్క్రీన్ ప్లే తో సాగే ఈ గమ్మత్తైన కథ మూవీ చివరి వరకు యంగేజ్ చేయడమే ఈ విజయానికి కారణమని దర్శకుడు సుహాస్ మీరా చెబుతున్నారు. దానికి తోడు నేపథ్య సంగీతమూ ఈ సినిమాలోని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ” సుహాస్ మాకు ఆటవిడుపుగా ‘ఐరావతం’ కథ చెప్పాడు. ఈ స్క్రీన్ ప్లే స్ట్రాటజీ నచ్చి మూవీ తీద్దామని అనుకున్నాం. ఇప్పుడీ మూవీని హాట్ స్టార్ వాళ్ళు నచ్చి తీసుకోవడం, తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం, ఇప్పుడు రెండు వారాలుగా మా మూవీ టాప్ వన్ పొజిషన్ లో ఉండటం ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. కథను నమ్మి ఈ సినిమా తీసినందుకు చాలా హ్యాపీ గా ఉన్నాం” అని అన్నారు.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
తాజావార్తలు
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్‌ను ఎలా నడిపించారు?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..