Satyadev: సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో ఇప్పుడో ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. చెన్నై బేస్డ్ ప్రొడక్షన్ హౌస్ ఓల్డ్ టౌన్ పిక్చర్స్, హైదరాబాద్ బేస్డ్ పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘పెంగ్విన్’ ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ దీనికి దర్శకుడు. హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ప్రాంతంలో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది.
లేటెస్ట్ ప్రోగ్రెస్ గురించి నిర్మాతలు ఎస్.ఎన్. రెడ్డి, బాల సుందరం తెలియచేస్తూ, ”మంచి స్క్రిప్ట్స్ ఇటీవలి కాలంలో హద్దులను చెరిపేశాయి. మేం కూడా అదే దిశలో సాగుతున్నాం. క్వాలిటీ సినిమాను ప్రేక్షకులకు అందించడం కోసం చేతులు కలిపాం. ప్రియా భవానీ శంకర్, సత్య అకల, సునీల్ వర్మ, జెనిఫర్ పిచినెటో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ 21వ తేదీ నుండి జరుగుతోంది. మొత్తం సినిమా షూటింగ్ వచ్చే ఫిబ్రవరి మొదటి వారంతో పూర్తవుతుంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభిస్తాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దీన్ని వేసవిలో విడుదల చేస్తాం” అని చెప్పారు. ఎస్.ఎన్. రెడ్డి, బాలసుందరం, దినేష్ సుదరం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుమన్ ప్రసార బాగే సహ నిర్మాత.