''మల్లేశం, పలాస, జార్జిరెడ్డి'' చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ 'మసూద' సినిమాలో కథానాయకుడి పాత్ర చేశాడు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యానని తిరువీర్ చెబుతున్నాడు.
సామాజిక సేవారంగంలోనూ నేను సైతం అంటూ ముందుకు సాగుతున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, దర్శకనిర్మాత శశి ప్రీతమ్. ఆయన సారథ్యంలో క్యాన్సర్, డయాబెటీస్, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ అండ్ కార్ ర్యాలీని నిర్వహించారు.
35 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను అందుకుని రవితేజా పాటల్లో సరికొత్త రికార్డ్ ను నెలకొల్పిందే 'థమాకా'లోని 'జింతాక్' సాంగ్. అంతే కాదు 250 మిలియన్లకు పైగా ఇన్ స్టా రీల్స్ ఈ పాటపై రావడం మరో రికార్డ్!
ధనుష్ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రం షూటింగ్ ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శేఖర్ కమ్ముల సైతం నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
'పుష్ప' సినిమాతో తెలుగువారి ముందుకొచ్చిన కన్నడ హీరో ధనుంజయ్ తాజా చిత్రం 'వన్స్ అపానే టైమ్ ఇన్ దేవరకొండ'. ఈ సినిమా టీజర్ మంగళవారం విడుదల కానుంది. సినిమా కన్నడ, తెలుగు భాషల్లో డిసెంబర్ 30న జనం ముందుకు రాబోతోంది.
Megha aakash: నితిన్ ‘లై’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్ ప్రస్తుతం నాలుగైదు తెలుగు సినిమాలలో నాయికగా నటిస్తోంది. అయితే.. ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించాలే కానీ సెకండ్ లీడ్ పోషించడానికీ మేఘా వెనకడటం లేదు. దాంతో ఆమె చేతిలో సినిమాలు బాగానే ఉంటున్నాయి. ఇటీవల చిత్ర నిర్మాణంలోనూ మేఘా ఆకాశ్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన ‘ప్రేమదేశం’ మూవీ డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. శిరీష […]
నూతన నటీనటులతో, సందేశాత్మకంగా హేమారెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ లవ్ స్టోరీ 'ఎపి 04 రామాపురం'. డిసెంబర్ 9న సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా శనివారం దీని ట్రైలర్ ను విడుదల చేశారు.
ఐదు జంటల కథతో సాగే ఆంథాలజీ మూవీ 'పంచతంత్రం'. డిసెంబర్ 9న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను శనివారం స్టార్ హీరోయిన్ రశ్మికా మందణ్ణ విడుదల చేశారు.
అక్టోబర్ నెలలో అనువాద చిత్రం 'కాంతార' సూపర్ హిట్ అయ్యి, ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా, ఈ నెలలోనూ అనువాద చిత్రానిదే పైచేయి అయ్యింది. 'దిల్' రాజు తెలుగు వారి ముందుకు తీసుకొచ్చిన తమిళ అనువాద చిత్రం 'లవ్ టుడే' బాక్సాఫీస్ లో చక్కని కలెక్షన్స్ వసూలు చేస్తోంది.