ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు' చిత్రం మార్చి 3న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొని సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేసింది.
శివ కందుకూరి నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రంలోని ఫస్ట్ సింగిల్ విడుదలైంది. విజయ్ బుల్గానిన్ స్వర రచన చేసిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి గానం చేశాడు.
ఫిబ్రవరి మాసంలో అనువాద చిత్రాలతో కలిపి 22 సినిమాలు విడుదల కాగా అందులో విజయం సాధించినవి కేవలం మూడు చిత్రాలే! ద్విభాషా చిత్రం 'సార్' ఫిబ్రవరిలో అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
Spielberg - Tom Cruise: చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరని అంటారు. హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూయిజ్, ఆస్కార్ అవార్డు విజేత స్టీవెన్ స్పీల్ బెర్గ్ అదే విషయాన్ని మరోమారు నిరూపించారు. స్పీల్ బెర్గ్ దర్శకత్వంలో టామ్ క్రూయిజ్ తొలిసారి నటించిన చిత్రం 'మైనారిటీ రిపోర్ట్', మంచి విజయం సాధించింది.
మాస్ట్రో ఇళయరాజా ఈ యేడాది జూన్ 3వ తేదీన 80 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ప్రపంచం గర్వించే ఈ సంగీత దర్శకుడితో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఈవెంట్ ను ప్లాన్ చేశారు.
ప్రముఖ హిందీ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు మిమో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతను హీరోగా నటించిన 'నేనెక్కడున్నా' మూవీ పోస్టర్, టీజర్ ను ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఆవిష్కరించారు.
'ప్రేమకావాలి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ విజయవంతంగా పుష్కరాకాలం పూర్తి చేశాడు. తాజాగా అతను నటించిన వెబ్ సీరిస్ 'పులి మేక' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 'సి.ఎస్.ఐ. సనాతన్' మూవీ మార్చి 10న విడుదల కాబోతోంది.
'గురు' ఫేమ్ రితికాసింగ్ నటించిన తాజా చిత్రం 'ఇన్ కార్'. మార్చి 3వ తేదీ ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో హర్షవర్థన్ ఈ సినిమాను తెరకెక్కించారు.
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు పూర్తి అయినా, 'దిల్' రాజు, సి. కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పడినట్టు కనిపించడం లేదు... వీరిద్దరి సినిమాలు వచ్చే నెల 3వ తేదీ బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతున్నాయి.