This Weekend Movies: ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: మార్చి ఫస్ట్ వీకెండ్ లో ఏడు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. అయితే అందులో బడ్జెట్ పరంగా భారీ చిత్రాలేవీ లేవు. అయితే, ఇవన్నీ కూడా విభిన్న కథాంశాలున్న చిత్రాలు. ఇందులో చెప్పుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. కోనేరు కల్పన ఈ సినిమాను కె. అచ్చిరెడ్డి సమర్పణలో నిర్మించారు. రాజేందప్రసాద్, మీనా, సోహైల్, మృణాళిని రవితో పాటుగా పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో యాక్ట్ చేశారు. కథ, కథనం, సంగీతం, దర్శకత్వంతో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాకు సంభాషణలు సైతం సమకూర్చడం విశేషం. ఇక కమెడియన్ వేణు ఎల్దండి తొలిసారి మెగా ఫోన్ చేతపట్టి తీసిన సినిమా ‘బలగం’. దీన్ని ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ మీద శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలంగాణ పల్లె నేపథ్యంలో మానవ సంబంధాల మీద ‘బలగం’ చిత్రం రూపుదిద్దుకుంది. ఖమ్మంలోని క్షురకురాలి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సాచి’. వివేక్ పోతగోని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో సంజన రెడ్డి, గీతిక రథన్, చెల్లి స్వప్న, అశోక్ రెడ్డి, మూలవిరాట్, టీవీ రామన్, ఏవీఎప్ ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఓ కారులో మహిళపై జరిగిన అత్యాచారం నేపథ్యంలో నిజ సంఘటన ఆధారంగా ‘ఇన్ కార్’ మూవీ తెరకెక్కింది. జాతీయ ఉత్తమనటిగా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న రిషికా సింగ్ ఇందులో ప్రధాన పాత్రను పోషించింది. అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా 3న విడుదల చేయబోతున్నారు. సాయిశివన్ జంపాన దర్శకత్వంలో ఎస్. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గ్రంథాలయం’. విన్ను మద్దిపాటి, స్మిత రాణి బోర, ‘కాలికేయ’ ప్రభాకర్, కాశీ విశ్వనాథ్, డా. భద్రం, సోనియా చౌదరి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇది కూడా శుక్రవారమే వస్తోంది. వీటితో పాటే మలయాళ చిత్రం ‘ట్వల్త్ మేన్’ ఆధారంగా రూపొందిన ‘రిచిగాడి పెళ్ళి’ సినిమా విడుదల కానుంది. నవీన్ నేని, బన్నీ వోక్స్, చందన రాజ్, ప్రణీత పట్నాయక్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అలానే ఓ ఆంగ్ల చిత్రం ఆధారంగా యేలూరి సురేందర్ రెడ్డి ‘బిగ్ స్నేక్ కింగ్’మూవీని రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. ఆ రకంగా వైవిధ్యభరితమైన ఏడు సినిమాలు ఈ వారంతంలో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. వీటిలో ఏవేవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.
Also Read
- Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?