Ritika Singh: యదార్థ సంఘటనల ఆధారంగా ‘ఇన్ కార్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
InCar: జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న ‘గురు’ ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’. అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మార్చి 3న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఇందులో రితిక సింగ్ మాట్లాడుతూ, “ఇది చాలా సీరియస్ అండ్ కంప్లీట్ రా ఫిల్మ్. ఈ సినిమా షూటింగ్ నాకో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు హర్షకు కృతజ్ఞతలు. చాలా భావోద్వేగానికి గురి చేసిన పాత్ర ఇది. చివరి క్షణం వరకూ పోరాడే పాత్ర చేశాను. కొన్ని సీన్లు చేస్తున్నపుడు టీం అంతా ఏడ్చేసేవారు. రోజూ మనం అత్యాచారంకు సంబంధించిన వార్తలు హెడ్ లైన్స్ లో చూస్తుంటాం. ఇలాంటి దారుణమైన సంఘటనలకు ఎలాంటి పరిస్థితులు దారి తీస్తాయనేది ఇందులో చూపించాం. చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. ఈ కథ విన్నప్పుడే నటనకు ఆస్కారం వుండే పాత్ర చేయబోతున్నానని అర్ధమైయింది. దాదాపు షూటింగ్ అంతా కార్ లోనే చేశాం. ఈ కథకు కంటిన్యూటీ చాలా ముఖ్యం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వరకూ నేను తల స్నానం చేయలేదు. ఈ మూవీ చివర్లో ఒక గొప్ప హోప్ ని ఇస్తుంది. అందరూ ‘ఇన్ కార్’ ని తప్పకుండా చూడాలి’’ అని అన్నారు.
Also Read
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
దర్శకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ, “ఇదో థ్రిల్లర్ మూవీ. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాం. అత్యాచారం చేసే వ్యక్తులు ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారు? వాళ్ళ మనస్తత్వం ఎలా వుంటుంది? అనే అంశాలని చూపించాలనే ఆలోచనతో ‘ఇన్ కార్’ రూపొందించాం. మహిళలు ఇలాంటి ఘటనలకు గురైనప్పుడు శారీరక హింసే కాదు మానసికంగా ఎలా హింసకు గురవుతారో ఇందులో చూపించాం. రితిక సింగ్ అద్భుతంగా నటించారు. ఇది ఒక సవాల్ తో కూడుకున్న పాత్ర. ఈ సినిమా కోసం దాదాపు 32 రోజుల పాటు ఆమె తలస్నానం చేయకుండా ఒకే డ్రెస్ తో వున్నారు. చాలా అంకితభావంతో నటించారు. ఈ సినిమాతో తప్పకుండా ఆమెకు మరోసారి జాతీయ అవార్డ్ వస్తుందనే నమ్మకం వుంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!