Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken Pickle Recipe: చికెన్‌తో చేసే వంటకాల్లో ‘చికెన్ పచ్చడి’ ఎంతో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా చికెన్ పచ్చడి వేసుకుంటే ఆ రుచే వేరు. ముఖ్యంగా సరైన విధానంలో తయారు చేస్తే ఈ పచ్చడి నాలుగు నెలల వరకు కూడా పాడవకుండా తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా, హోటల్ స్టైల్లో చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
చికెన్ మారినేషన్ కోసం..
* బోన్‌లెస్ చికెన్ – అర కేజీ
* ఉప్పు – 1 టీ స్పూన్
* పసుపు – ¼ టీ స్పూన్
పచ్చడి కోసం..
* నూనె – 1 కప్పు (సుమారు 150 ml)
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
* కారం – ¼ కప్పు
* ఉప్పు – ¼ కప్పు
* నిమ్మకాయలు – 2
మసాలా పొడి కోసం..
* దాల్చిన చెక్క – 1 ఇంచ్ ముక్క
* యాలకులు – 2
* లవంగాలు – 5 నుంచి 6
* ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు
* ఆవాలు – 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
* మెంతులు – ¼ టేబుల్ స్పూన్
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తయారీ విధానం:
చికెన్ మారినేట్:
మొదట బోన్‌లెస్ చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక బౌల్లో వేసి అందులో ఉప్పు, పసుపు కలపాలి. ఈ మిశ్రమం చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలిపి సుమారు 15 నిమిషాల పాటు మారినేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చికెన్‌కు మంచి రుచి వస్తుంది.
మసాలా పొడి తయారీ:
ఒక పాన్‌లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి స్వల్పంగా వేయించాలి. తర్వాత ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి లో ఫ్లేమ్‌పై రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ మసాలా పొడే చికెన్ పచ్చడికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.
చికెన్‌ను క్రిస్పీగా ఫ్రై:
స్టవ్‌పై కడాయి పెట్టి అందులో నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక మారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి మధ్యస్థ మంటపై వేయించాలి. మొదట చికెన్ లోని నీరు బయటకు వస్తుంది. తర్వాత నెమ్మదిగా చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పై భాగం క్రిస్పీగా మారుతుంది. చికెన్ పూర్తిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించడం చాలా ముఖ్యం. లేదంటే పచ్చడి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. వేయించిన చికెన్‌ను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి.
పచ్చడి తయారీ:
అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు రెండు నుంచి మూడు నిమిషాలు వేయించాలి. తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను మళ్లీ అందులో వేసి కలపాలి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సన్నని మంటపై ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉంచాలి. ఈ సమయంలో పచ్చడి పైకి నురుగు రావడం ప్రారంభమవుతుంది. ఆలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయల రసం పిండాలి. నిమ్మరసం వేసిన తర్వాత మరోసారి బాగా కలపాలి.
నిల్వ చేసే విధానం:
తయారైన చికెన్ పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేయాలి. ఇలా నిల్వ చేస్తే ఫ్రిజ్‌లో పెట్టకుండానే నాలుగు నెలల వరకు తాజాగా ఉంటుంది. రుచికరమైన ఈ చికెన్ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి వేడి అన్నంతో ఆస్వాదించండి.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!