Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Reddy Birthday: కూల్‌గా ఆడుతూనే అవసరమైనప్పుడు సిక్సర్ల వర్షం కురిపించే టెక్నిక్.. బౌలింగ్‌తోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల టాలెంట్.. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడిని అధిగమించే టెంపరమెంట్.. ఈ మూడు కలగలిపితేనే నితీష్ కుమార్ రెడ్డి (NKR). విశాఖపట్నం నుంచి దూసుకొచ్చి, నేడు భారత క్రికెట్లో సంచలన ఆల్‌రౌండర్‌గా ఎదిగిన నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు (మే 26) తన 22వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్, టీమిండియా యంగ్ గన్ నితీష్ కుమార్ రెడ్డి ప్రయాణంపై ప్రత్యేక కథనం.
విశాఖపట్నం టూ మెల్బోర్న్..
2003 మే 26న వైజాగ్‌లో జన్మించిన నితీష్ రెడ్డి, చిన్న వయసులోనే తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2017-18 అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఏకంగా 1,237 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ఆ సీజన్లో నితీష్ చూపించిన ప్రతిభకు గానూ బీసీసీఐ (BCCI) నుంచి ‘బెస్ట్ క్రికెటర్’ అవార్డును కూడా అందుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శనతో దూసుకెళ్తూ, భవిష్యత్తులో టీమిండియాకు కాబోయే నమ్మకమైన ఆల్‌రౌండర్ తానేనని అప్పుడే నిరూపించుకున్నాడు.
Also Read
- Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
ఎమర్జింగ్ ప్లేయర్ నుండి 6 కోట్ల రిటెన్షన్:
నితీష్ కుమార్ రెడ్డి కెరీర్‌ను మలుపు తిప్పింది ఐపీఎల్. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఐపీఎల్ 2024 సీజన్లో ఆడిన నితీష్, లోయర్ మిడిలార్డర్లో వచ్చి విధ్వంసకర ఇన్నింగ్స్ లతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఆ సీజన్లో 143 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేయడమే కాకుండా, కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. అతని టాలెంట్‌ను గుర్తించిన ఎస్ఆర్హెచ్ (SRH) మేనేజ్మెంట్.. ఏకంగా రూ. 6 కోట్ల భారీ ధరతో అతన్ని రిటెయిన్ చేసుకుందంటేనే నితీష్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
చారిత్రాత్మక టెస్ట్ సెంచరీ:
ఐపీఎల్ సక్సెస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నితీష్.. టీ20లు, వన్డేలతో పాటు టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ఆస్ట్రేలియాపై నంబర్ 8 పొజిషన్లో బ్యాటింగ్‌కు వచ్చి, ఒత్తిడిలో అతను ఆడిన 114 పరుగుల ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాటర్‌గా నితీష్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా పేసర్ల బౌన్సర్లను, స్లెడ్జింగ్‌ను ఎదుర్కొంటూ NKR చూపించిన టెక్నిక్, టెంపరామెంట్కు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. హార్దిక్ పాండ్యా తర్వాత భారత్‌కు దొరికిన ప్రాపర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Happy Birthday Nitish Kumar Reddy 🧡❤️🔥 @NKReddy07 #NKR pic.twitter.com/8r83uTvkMT
— Bhargav Pilli (@Bhargavexe) May 25, 2026
తాజావార్తలు
-
Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..