Mimoh Chakraborty: ‘నేనెక్కడున్నా’ అంటున్న మిథున్ తనయుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nenekkadunna Movie: సీనియర్ హిందీ హీరో మిథున్ చక్రవర్తికి తెలుగు సినిమా రంగంలో చక్కని అనుబంధం ఉంది. ఆయన నటించిన హిందీ చిత్రాలు తెలుగు రీమేక్ కావడమే కాదు… అనేక తెలుగు హిందీ రీమేక్స్ లో మిథున్ నటించాడు. మూవీ మొఘల్ డి. రామానాయుడు హిందీలో మిథున్ తో ‘దిల్ వాలా’ మూవీ నిర్మించారు. అలానే సురేశ్ బాబు నిర్మించిన ‘గోపాల గోపాల’ చిత్రంలో మిథున్ చక్రవర్తి ఓ కీలక పాత్ర పోషించారు. తాజాగా మిథున్ చక్రవర్తి తనయుడు మిమో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతను హీరోగా మాధవ్ కోదాడ దర్శకత్వంలో కె.బి.ఆర్. సమర్పణలో మారుతి శ్యాంప్రసాద్ రెడ్డి ‘నేనెక్కడున్నా’ అనే సినిమా నిర్మించారు. ఎయిర్ టెల్ వాణిజ్య ప్రకటనతో గుర్తింపు తెచ్చుకున్న, ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ఫేమ్ సశా ఛెత్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పోస్టర్ ను, టీజర్ ను ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.
చిత్ర దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ ”జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది” అని చెప్పారు. నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ “సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరులో షూటింగ్ చేశాం. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. స్టోరీ, మ్యూజిక్, విజువల్స్, డైరెక్షన్ మా సినిమాకు బలం. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో రష్యన్ డాన్సర్లతో చేసిన పబ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!