Shiva Kandukuri: విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు శివ కందుకూరి. అతను నటిస్తున్న తాజా చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీసింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని సాంగ్ ఒకటి మంగళవారం విడుదలైంది.
“అందాల ఓ వెన్నెల నువ్వు నా కళ్ళ ముందుండగా / ఏనాడూ ఏ చీకటి ఇక రాదంట నా వైపుగా / డప్పుకొట్టి చెప్పుకొనా / ఊరంతా నేను డప్పుకొట్టి చెప్పుకొనా / గుప్పెడంత గుండెలోన ఆనందమంతా డప్పుకొట్టి చెప్పుకొనా” అంటూ సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్ రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. దీనికి విజయ్ బుల్గానిన్ స్వర రచన చేశాడు. ఇదివరకే రిలీజైన మోషన్ పోస్టర్ తో అంచనాలను పెంచింది ఈ చిత్రం. అలానే ఈ చిత్ర టీజర్ కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో శివ కందుకూరి డిటెక్టివ్ గా కనిపించనున్నాడు. మంచి కథతో పాటు అద్భుతమైన విజువల్స్ ఈ మూవీ ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్ పీరియన్స్ ను అందించే ఈ మూవీ మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.