Organic Mama Hybrid Alludu: సక్సెస్ వచ్చిన తర్వాతే అసలు లైఫ్ మొదలౌతుంది: సొహైల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S.V. Krishna Reddy: ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. రాజేంద్ర ప్రసాద్, సొహైల్, మృణాళిని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత సి. కల్యాణ్ కుమారుడు వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ వేదికపై ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ”ఇప్పటి వరకూ నేను పనిచేసిన నిర్మాతలు ఒకటి, ఈ సినిమా నిర్మాత కల్పన గారు వేరొకటి. ఎందుకంటే.. ఇంతకు ముందు నేను నా నిర్మాతను ఏ ఆర్టిస్ట్‌ను, టెక్నీషియన్‌ను అడిగితే వారిని తెచ్చేవారు. కానీ కల్పన గారు మాత్రం నేను అడిగిన రేంజ్ వారికన్నా తగ్గేదేలే అంటూ ఇంకా పై రేంజ్ ఉన్న వారిని తీసుకొచ్చారు. అందుకే ఈవిడ స్పెషల్. ఈ సినిమా కోసం మేం పడ్డ తపనకు ఫలితం వచ్చే రోజు మార్చి 3న కావడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.
ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ, ”ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌లో ఫ్యామిలీ బంధాలను తెలుపుతూనే.. ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిక్స్ చేసిన విధానం చాలా ఆకట్టుకుంది. ప్రస్తుతం వస్తున్న చాలా సినిమాల పాయింట్స్ 20 సంవత్సరాల క్రితం వచ్చినవే. కాకపోతే కొత్త కొత్త హంగులు, ఆకర్షణలతో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సినిమాలో పిల్లల మీద ఉండే ప్రేమాభిమానాలు, కుటుంబంలో ఉండే ప్రేమానుబంధాలను అద్భుతంగా చెప్పారు కృష్ణారెడ్డి గారు. ఇందుకు ఉదాహరణగా ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను చెప్పాలి. మనసున్న ప్రతి ఒక్కరి కళ్లు ఖచ్చితంగా చెమర్చేలా ఈ ఎపిసోడ్ ఉంది. ఇందులో ఏడ్పులు, పెడబొబ్బలు ఏమీ ఉండవు. కానీ భావం మన మనసును ద్రవింపజేస్తుంది. అంత ట్రెండీగా తీశారు కృష్ణారెడ్డి గారు. ఖచ్చితంగా దీని తర్వాత కృష్ణారెడ్డి గారిని పెద్ద నిర్మాతలు డేట్స్ అడుగుతారు. నిర్మాతగా కల్పనకు డేర్ ఎక్కువ. ఈ విషయంలో నేను ఆమెతో తూగను. ఈ సినిమా మేకింగ్ కోసం ఆమె పెట్టిన ఖర్చు నాకు ఆశ్చర్యం వేసింది. ఆమెకు సినిమా మీద ఉన్న నమ్మకం అంది. సొహైల్ కు ఈ చిత్రం తర్వాత మంచి మార్కెట్ వస్తుంది. దాన్ని అతను నిలబెట్టుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అజయ్ ఘోష్‌లో తెలివైన రావుగోపాలరావు, అతి తెలివైన ప్రకాష్‌రాజ్‌కనిపిస్తారు. అతను మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. మీనా సహకారం ఎప్పటికీ మరువలేం. నిర్మాతల ఆర్టిస్ట్ ఆమె. రాజేంద్రప్రసాద్ గారితో నేను తొమ్మిది సినిమాలు చేశాను. చాలా కంఫర్టబుల్ ఆర్టిస్ట్” అని అన్నారు.
Also Read
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Disha Salian Death Case: 'నేను ఇకపై మౌనంగా ఉండను'... దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
Read Also: Organic Mama Hybrid Alludu: సక్సెస్ వచ్చిన తర్వాతే అసలు లైఫ్ మొదలౌతుంది: సొహైల్
ఈ చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ, ”ఈ సినిమా అద్భుతంగా రావటానికి ఏం చేయాలో అది ఎవరి పరిధిలో వారు ది బెస్ట్ అన్నట్టుగా చేశారు. తన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో కృష్ణారెడ్డి గారు సంపాదించుకున్న గుడ్‌విల్‌ను మరింత పెంచే సినిమా ఇది. ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ కృష్ణారెడ్డి గారు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని అన్నారు. హీరో సోహైల్ మాట్లాడుతూ, ”ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తాను. 90ల్లో కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగినోళ్లం. అన్ని రంగాల్లోకి టఫ్ రంగం.
అందరూ సక్సెస్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయింది అంటారు. కానీ సక్సెస్ వచ్చిన తర్వాతే అసలు లైఫ్ మొదలౌతుంది. ఎన్నో టెన్షన్స్‌తో థియటేర్స్‌కు వచ్చే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ… వారి కష్టాలను మర్చిపోయేలా చేయడమే ఆర్టిస్ట్‌ల బాధ్యత. ఈ సినిమాలో ఆ బాధ్యతను నూరు శాతం నెరవేర్చామని ఫీలవుతున్నా. నా ప్లేస్‌లో మరో హీరో ఎవరైనా ఉంటే ఇది చాలా పెద్ద సినిమా అయ్యేది. కానీ నా టాలెంట్‌ను గుర్తించి నన్ను ఈ సినిమాలో హీరో పాత్రకు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా” అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు అజయ్ ఘోష్, సురేశ్ కొండేటి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!