మాస్ మహరాజా రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ సరసన 'ఏయ్ పిల్లా' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది మిస్ ఇండియా 2022 ఫస్ట్ రన్నరప్ రుబల్ షెకావత్. ఇప్పుడీ అందాల భామకు తెలుగులో మరో ఛాన్స్ 'అవసరానికో అబద్దం' రూపంలో దక్కింది.
త్రిగుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అవసరానికో అబద్ధం' షూటింగ్ పూజా కార్యక్రమాలతో శుక్రవారం మొదలైంది. త్రిగుణ్ సరసన ఈ చిత్రంలో రుబాల్ షెకావత్ హీరోయిన్ గా నటిస్తోంది.
రెజీనా కసాండ్రా ప్రధాన పాత్ర పోషించిన 'నేనే నా' సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్, నాన్ థ్రియేట్రికల్ రైట్స్ ను తమిళనాడుకు చెందిన ఎస్.పి. సినిమాస్ సొంతం చేసుకుంది. వేసవి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'. గతంలో 'హ్యపీ వెడ్డింగ్' మూవీని రూపొందించిన లక్ష్మణ్ కార్య దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.
ఇటీవల మినర్వా గ్రూప్ తో కలిసి నమ్రత, సునీల్ నారంగ్ 'మినర్వా కాఫీ షాప్'ను ప్రారంభించారు. దీనితో పాటే ఇప్పుడు లగ్జరీ వసతులతో 'ప్యాలెస్ హైట్స్' రెస్టారెంట్ ను మొదలు పెట్టారు.
'మహానటి' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది. అదే పాత్రను పూజా హెగ్డే చేసి ఉంటే ఎలా ఉంటుందనే ప్రశ్న ఉదయిస్తే... నెటిజన్స్ సమాధానం ఎలా ఉంటుందో మీకు తెలుసా!?
అలనాటి శృంగార తార జయమాలినిని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. పోలీస్ అధికారి పార్తీబన్ తో వివాహానంతరం ఆమె నటనకు దూరమైంది. రేపు వారి కుమారుడు శ్యామ్ హరి వివాహం చెన్నయ్ లో జరుగబోతోంది.
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడు మాటల రచయితగానూ మారిపోయారు. తన తాజా చిత్రం 'ఆర్గానిక్ మామ - హైబ్రీడ్ అల్లుడు'కు ఆయనే సంభాషణలు సమకూర్చుకున్నారు. ఈ సినిమా మార్చిలో జనం ముందుకు రాబోతోంది.