వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
- ఇన్ఫినిక్స్ HOT 70 స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలో లాంచ్
- మొత్తం 12 కలర్ వేరియంట్లలో ఫోన్ అందుబాటులోకి
- “Thermo Orange Edition” ఉష్ణోగ్రతను బట్టి రంగు మార్చుకుంటుంది
- చల్లటి వాతావరణంలో డీప్ ఆరెంజ్, వేడి సమయంలో లైట్ ఆరెంజ్గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix HOT 70 Launched: ఇన్ఫినిక్స్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 70 (Infinix HOT 70)ను ఇండోనేషియాలో లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన HOT 60కు సక్సెసర్‌గా ఈ ఫోన్ లాంచ్ చేసింది. స్టైలిష్ లుక్, AI ఫీచర్లు, భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లతో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో కొత్తగా “డైనమిక్ షైన్ డిజైన్” కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. మొత్తం 12 కలర్ వేరియంట్లతో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా “Thermo Orange Edition” వెర్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మోడల్ వెనుక భాగం ఉష్ణోగ్రత ఆధారంగా రంగు మార్చుకునే టెక్నాలజీతో రూపొందించారు. చల్లటి వాతావరణంలో డీప్ ఆరెంజ్గా, ఎక్కువ ఉష్ణోగ్రతలో లైట్ ఆరెంజ్గా మారుతుంది.
అలాగే క్వైట్ వైలెట్, గ్రీన్ టెక్చర్ ఎడిషన్లలో ప్రత్యేక “Lumina Flare Dynamic Flame Texture” డిజైన్ ఇచ్చారు. ఇది కాంతి పడే కోణాన్ని బట్టి బ్యాక్ ప్యానెల్‌పై వేర్వేరు ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఫోన్ కెమెరా మాడ్యూల్ చుట్టూ “Crystal Mood Island” అనే ప్రత్యేక డిజైన్ కూడా ఇందులో అందించారు. ఈ ఫోన్లో ప్రత్యేకంగా One-Tap AI బటన్ ఇచ్చారు. ఈ బటన్ ద్వారా AI ఫీచర్లను వెంటనే యాక్సెస్ చేయవచ్చు. చిన్న ప్రెస్‌తో AI ఫ్లాష్ మెమో యాక్టివేట్ అవుతుంది. ఇది స్క్రీన్‌పై కనిపించే డేటాను గుర్తించి క్యాలెండర్ ఈవెంట్స్, కాంటాక్ట్స్, ఈమెయిల్ డ్రాఫ్ట్స్ వంటి పనులను ఆటోమేటిక్‌గా రూపొందిస్తుంది. అలాగే సమాచారాన్ని AI MindHubలో సేవ్ చేసి సులభంగా సెర్చ్ చేసుకునే అవకాశం కల్పించారు.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..

అలాగే లాంగ్ ప్రెస్‌తో Folax AI యాక్టివేట్ అవుతుంది. ఇందులో ChatGPT, గూగుల్ జెమినీ సహా ఐదు ప్రముఖ AI మోడళ్లను ఉపయోగించవచ్చు. AI కస్టమ్ వాల్ పేపర్స్, AI థీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫోన్లో 50MP ప్రధాన కెమెరా ఇచ్చారు. ఇందులో 6.78 అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. MediaTek Helio G100 Ultimate ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6GB, 8GB RAM వేరియంట్లతో పాటు 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఫోన్లో 6000mAh భారీ బ్యాటరీ ఇచ్చారు. 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటంతో గంటలోపు ఫుల్ చార్జ్ అవుతుంది. అలాగే గేమింగ్ సమయంలో హీట్ తగ్గించేందుకు All-Scenario Bypass Charging ఫీచర్‌ను కూడా అందించారు. దృఢత్వ పరంగా కూడా ఈ ఫోన్ IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు SGS గోల్డ్ స్టాండర్డ్ డ్రాప్ రెసిస్టన్స్ సర్టిఫికేషన్ కూడా పొందింది. 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునేలా దీనిని డిజైన్ చేశారు.

ఇన్ఫినిక్స్ HOT 70 ధరల విషయానికి వస్తే.. 4GB + 128GB వేరియంట్ ధర రూ.11,785 కాగా, 8GB + 128GB మోడల్ ధర రూ.17,550. టాప్ ఎండ్ 6GB + 256GB వేరియంట్ ధర రూ.18,250గా నిర్ణయించారు. త్వరలో HOT 70 Pro మోడల్‌ను కూడా కంపెనీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?