Aadi Saikumar: శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన సినిమా ‘సిఎస్ఐ సనాతన్’. ఆది సాయికుమార్, మిషా నారంగ్, నందినీ రాయ్, వాసంతి, తారక్ పొన్నప్ప, అలీ రెజా, ఖయ్యూమ్ ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిపికెట్ పొందింది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్మాత నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘‘ఆది అన్నకు ఈ కథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన ఎగ్జైట్మెంట్ చూసిన తర్వాత కథపై దర్శకుడు దేవ్ తో కలిసి ఇంకా హార్డ్ వర్క్ చేశాం. ఈ కథకు సంబంధించి ప్రతి డీటెయిలింగ్ కోసం స్టడీ చేశాం. మా కెమెరామేన్ శేఖర్ వర్క్ సినిమా చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఆర్.ఆర్. సినిమాకే హైలెట్ గా నిలవబోతోంది. ఈ సినిమాపై నమ్మకంతో థియేటర్ కు వచ్చే ఆడియన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ డిజప్పాయింట్ కారని ఖచ్చితంగా చెప్పగలను” అని హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో తానో కీలక పాత్ర పోషించానని నటి, బిగ్ బాస్ ఫేమ్ వాసంతి తెలిపింది. ఇందులో ఓ ప్రధాన పాత్రలో నటించానని యాంకర్ రోజా చెప్పింది.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాలో నటించిన వారిలో చాలామంది కొలీగ్స్, ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా చూసి ఆ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకోవడం నా ప్రొఫెషన్ లో భాగం. బట్ సినిమా తీసే ఎక్స్ పీరియన్స్ ను నాకు అందించిన మొదటి సినిమా ఇది. అందుకే ఇది నాకు స్పెషల్ మూవీ కూడా. స్క్రిప్ట్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ ప్రతి క్రాఫ్ట్ నూ పర్సనల్ గా ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన చాగంటి ప్రొడక్షన్స్ శాంతయ్యగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాతో మీరు ఓ కొత్త ఆది సాయికుమార్ ను చూడబోతున్నారు. ఇప్పటి వరకూ ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఈ మూవీలో సినిమా అంతా ఒకే మూడ్ లో కనిపించబోతున్నారు. రీసెంట్ గా ‘పులి మేక’ సిరీస్ తో పెద్ద విజయం అందుకున్న ఆదిగారికి ఈ మూవీ మరో పెద్ద విజయం ఇస్తుందనుకుంటున్నాను. ఈ మూవీతో ఆయనకు కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుందని భావిస్తున్నాను” అని అన్నారు. ‘ఆచార్య, అఖండ’ తర్వాత ఇందులో పెక్యులర్ రోల్ చేశానని శివ కార్తీక్ తెలిపాడు. ఇందులో ఫోరెన్సిక్ డాక్టర్ పాత్ర చేశానని నాగేశ్వరరావు చెప్పాడు. దర్శకుడు శివశంకర్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకోవడం జరిగింది. ఇప్పటికే మన దేశంలో ఇలాంటివి చాలా జరుతున్నాయి. ఈ కథ ద్వారా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాం. అందువల్ల ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాం” అని అన్నారు.
హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘యేడాదిన్నర క్రితం దేవ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మామూలుగా ఇలాంటి కథలు మలయాళంలో చూస్తుంటాం. ఒక మంచి పాయింట్ తీసుకుని కంప్లీట్ గా దాని మీదే రన్ అయ్యే ఓ మంచి కంటెంట్ ఇది. తెలుగులో ఓ క్రైమ్ సీన్ పై ఖచ్చితంగా ఓ పాయింట్ చుట్టూ తిరిగే కథ తెలుగులో ‘సిఎస్ఐ సనాతన్’ మొదటిది అనుకుంటున్నాను. ఇది నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. ఫైనాన్సియల్ క్రైమ్ చుట్టూ ఇది తిరుగుతుంది. సీన్ బై సీన్ బిల్డ్ అవుతుంది. దర్శకుడు చాలా డీటెయిల్డ్ గా ఈ కథను చెప్పాడు. ఈ మూవీ దేవ్ కు మంచి హిట్ ఇవ్వాలని.. అలాగే మా నిర్మాత శ్రీనివాస్ గారికి పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తారక్ పొన్నప్ప చాలామంచి పాత్ర చేశాడు. అలీ రెజా పాత్ర కూడా బావుంటుంది. మీ అందరూ దీనిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.