Madhave Madhusudana: కొడుకు కోసం మెగా ఫోన్ పట్టిన మేకప్ మ్యాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bommadevara Ramachandra Rao: టాలీవుడ్ లో పేరున్న మేకప్ మ్యాన్ బొమ్మదేవర రామచంద్రరావు. పలు విజయవంతమైన చిత్రాలకు మేకప్ మ్యాన్ గా పనిచేసిన బొమ్మదేవర రామచంద్రరావు… అక్కినేని కుటుంబానికి అత్యంత ఆత్మీయులు. విశేషం ఏమంటే… ఆయన గతంలో అనుష్క నాయికగా సముద్ర దర్శకత్వంలో ‘పంచాక్షరి’ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు తన తనయుడు తేజ్ బొమ్మదేవర కోసం నిర్మాతగానే కాదు… దర్శకుడిగానూ మారారు.
బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై బొమ్మదేవర రామచంద్రరావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు ‘మాధవే మధుసూదనా’. హీరో తేజ్ బొమ్మదేవర సరసన రిషిక లోక్రే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఈ మూవీలోని తొలి గీతాన్ని నాగచైతన్య తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, “పాట చాలా బావుంది. మొదటగా తేజ్ కి కంగ్రాట్యులేషన్ చెప్పాలి. అతని డాన్స్ బావుంది. యాక్టింగ్ బావుంది, అలాగే లుక్ అన్ని బాగా కుదిరాయి. ఇక మా చంద్ర గురించి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. చిన్నప్పుడు సెలవుల్లో నాన్న షూటింగ్స్ కి వెళుతుండేవాడిని. అక్కడ చంద్ర పక్క నుండి అన్నీ చెబుతుండేవారు. అలాంటి చంద్ర ఇవ్వాళ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసాడు అంటే చాలా ఆనందంగా ఉంది. చంద్ర ఇంత బాగా హ్యాండిల్ చేస్తారని ఊహించలేదు. వెరీ వెరీ హ్యాపీ” అన్నారు. ఇందులో తాను మూడు పాటలు విన్నానని, అన్నీ బాగున్నాయని, కొరియోగ్రఫీ కూడా ఎంతో బాగుందని నాగచైతన్య కితాబిచ్చారు. ఈ సందర్భంగా హీరోయిన్ రిషికతో పాటు కొరియోగ్రాఫర్స్ రాజు మాస్టర్, రఘు మాస్టర్, బృంద మాస్టర్ కు అభినందనలు తెలిపారు. ఈ సినిమాకు వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలెట్ అని, వాసు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని, ఉద్దవ్ ఎస్ బి ఎడిటర్‌గా బాగా వర్క్ చేశారని దర్శక నిర్మాతలు చెప్పారు.
Also Read
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!