NTV WebDesk
Author- NTV Telugu-
మళ్లీ చైనాలో లాక్డౌన్… ఆ నగరం పూర్తిగా మూసివేత…
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్‌తో పాటుగా మరికొన్ని వేరియంట్లు అక్కడ చైనాలో వెలుగుచూస్తున్నాయి. దీంతో మరోసారి ఆంక్షలు విధేంచేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధం అయింది. పూజియాన్ ప్రావిన్స్‌లోని పుతియాన్ నగరంలో 19 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా కేసులు వెలుగుచూడటంతో ఆ నగరంలో ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి ఆ నగరాన్ని పూర్తిగా మూసివేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసరంగా ఎవరైనా బయటకు రావాలి అంటే […] -
దట్ ఈజ్ విమెన్ పవర్: ధైర్యంగా ఉద్యోగాల్లో చేరిన ఆఫ్ఘన్ మహిళలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైంది. మహిళల విషయంలో తాలిబన్లు కాస్త మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారు. చదువుకునేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఇక, ఉద్యోగాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే, కొంత మంది మహిళలు ధైర్యంతో ఉద్యోగాల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. కాబూల్ ఎయిర్పోర్ట్ తిరిగి తెరుచుకోవడంతో అక్కడ 12 మంది మహిళలు తిరిగి ఉద్యోగాల్లో చేరారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోని చెకింగ్ డిపార్ట్మెంట్లో ఈ మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబం పోషణ జరగాలంటే ఉద్యోగం చేయాలని, ఉద్యోగానికి […] -
సెప్టెంబర్ 13, సోమవారం దినఫలాలు…
మేషం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారానికి బాగా శ్రమిస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. స్త్రీలు షాపింగ్ విషయాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. వృషభం : మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూల, బేకరీ తినుబండారాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు, కీలకమైన విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. […] -
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌పార్టీకి షాక్: బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు…
ఉత్తరభారతంలో మెల్లిగా ఎన్నికల వేడి రగులుకుంటోంది. వచ్చే ఏడాది 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ఐదేళ్ల కాలంలో మూడు సార్లు ముఖ్యమంత్రులను మార్చింది. గతంలో బీజేపీలో ఉండి ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరిన నేతలను తిరిగి బీజేపీలో చేరే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. పురోలా నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ […] -
యూపీలో పోటీకి శివసేన సై…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 403 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 100 చోట్ల పోటీ చేసేందుకు శివసేన సిద్దంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు మహారాష్ట్రకు పరిమితమైన శివసేన పార్టీని విస్తరించుకోవడానికి సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగానే యూపీలో పశ్చిమ భాగం నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నది. యూపీ పశ్చిమ రైతులు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, తప్పకుండా పోటీ చేసి తమ ప్రభావం చూపుతామని శివసేన ఎంపీ సంజయ్ […] -
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్రభాయ్ పటేల్…
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర లక్ష్మీకాంత్ పటేల్ ఎంపికయ్యారు. ఈరోజు గుజరాత్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చించారు. భూపేంద్రభాయ్ పటేల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. 2017లో జరిగిన ఎన్నికల్లో భూపేంద్ర లక్ష్మీకాంత్ పటేల్ అత్యథిక మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌పై 1,17,000 ఓట్ల మెజారిటీతో భూపేంద్రభాయ్ పటేల్ విజయం సాధించారు. పటేల్ సామాజిక […] -
అమెరికాలో వ్యాక్సిన్ రచ్చ… వ్యాక్సిన్ తీసుకోకుంటే…
అమెరికాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వ్యాక్సిన్ల కొరత లేనప్పటికీ మతపరమైన కారణాలు, ఇతర సొంత కారణాల వలన వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిపై వివక్ష మొదలైంది. ట్యాక్సీల్లో ప్రయాణం చేయాలంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కొన్ని ట్యాక్సీ సంస్థలు నిబంధనలు పెడుతున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా […] -
టీడీపీలో రాయలసీమ సదస్సు చిచ్చు…
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్‌లపై సదస్సు జరిగిందని, దీనిని ఎలా తప్పు పడతారని ఎమ్మెల్యే కేశవ్ పేర్కొన్నారు. కాల్వ శ్రీనివాసులపై ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే కేశవ్ కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రి రాజకీయాలు ఇక్కడ చేస్తే తిరుగుబాటు […] -
ఆఫ్ఘన్లో మహిళలు చదువుకోవచ్చు… అయితే అలా మాత్రం కాదు…
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల చదువు విషయంపై తాలిబన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1996లో మహిళలు చదువుకోవడానికి వీలు లేదని, వారు ఇంటికే పరిమితమయ్యి పిల్లల్ని కనేందుకు మాత్రమే పనిచేయాలి అనిచెప్పిన తాలిబన్లు, ఈసారి కొంత మార్పును తీసుకొచ్చారు. మహిళలు చదువుకోవడానికి వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు విద్యను అభ్యసించవచ్చునని, అయితే పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా క్లాస్‌రూములు ఏర్పాటు చేయాలని ఆఫ్ఘన్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక, మహిళలు తప్పనిసరిగా హిజబ్‌లు ధరించాలని ఆదేశించింది. చదువుకోవడానికి […] -
నిమర్జనంపై హౌస్‌మోషన్ పిటిషన్… విచారణకు హైకోర్టు నిరాకరణ
గణేష్ చతుర్థి సందర్భంగా నగరంలో భారీ గణనాథులను ఏర్పాటుచేశారు. మూడో రోజు నుంచి గణపతుల నిమర్జన కార్యక్రమం జరగాల్సి ఉన్నది. ఈరోజున నిమర్జనం కావాల్సిన విగ్రహాలు కొన్ని ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుంటున్నాయి. అయితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు హైకోర్టు అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హాని కలుగుతుందని, హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం హౌస్ […]
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!