ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టమైనవి పోస్ట్ చేయటం ఇప్పుడు సెలబ్రిటీలకు డెయిలీ రొటీన్ అయిపోయింది. యంగ్ హీరో ఇషాన్ కట్టర్ ఇందుకు మినహాయింపు కాదు. అయితే, లెటెస్ట్ వీడియోలో ఇషాన్ బిగ్ బ్రదర్ తో కలసి స్టెప్స్ మ్యాచ్ చేశాడు! వారిద్దరి డ్యాన్సుల్నీ భాభీ జీ సొషల్ మీడియాలో పోస్ట్ చేసింది…
ఓ ఇంగ్లీషు పాటకి హుషారుగా స్టెప్పులేశారు షాహిద్, ఇషాన్. డ్యాన్సుల విషయంలో మంచి పేరున్న షాహిద్ ఎప్పటిలాగే ఇరగదీశాడు. అన్నతో పోటీ పడుతూ ఇషాన్ కూడా ఊగిపోయాడు. అయితే, వీరిద్దరి డ్యాన్సింగ్ వీడియో నెటిజన్స్ తో పంచుకుంది మాత్రం మిసెస్ మీరా రాజ్ పుత్. షాహిద్ భార్య మీరా అన్నదమ్ములిద్దరి జోష్ ఫుల్ మజాని ఇన్ స్టాలో షేర్ చేసింది.
ఇక కామెంట్స్ సెక్షన్ లో అందర్నీ ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? అనన్య పాండే! ఆమె ‘ఇట్స్ ద చిల్లీ పనీర్’ అంటూ కామెంట్ పెట్టింది. ‘వైబ్’ అని కూడా వ్యాఖ్యానించింది. ఇషాన్, అనన్య మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ బీ-టౌన్ లో కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు షాహిద్, ఇషాన్ డ్యాన్స్ వీడియోకి అనన్య కామెంట్ చేయటం అందరికీ ఆసక్తి కలిగించింది…