ప్రస్తుతం ఇండియన్ సినీ వరల్డ్ మొత్తం ఒకే పేరుతో మారుమోగిపోతోంది.. అదే ‘ధురంధర్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తూ, వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఒక నిరాశజనకమైన వార్త. ‘ధురంధర్’ సినిమా సాధిస్తున్న అఖండ విజయాన్ని చూసి, తెలుగులో కూడా దీనిని భారీ ఎత్తున విడుదల చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. రైట్స్ కూడా సొంతం చేసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
Also Read :Manchu Manoj : శివాజీ ‘సామాన్లు’ కామెంట్స్.. మంచు మనోజ్ సంచలన లేఖ
దీనికి ప్రధాన కారణం ఓటీటీ అగ్రిమెంట్. సాధారణంగా ఒక సినిమా థియేట్రికల్ రిలీజ్ సమయంలోనే అన్ని భాషల డబ్బింగ్ హక్కులు, డిజిటల్ స్ట్రీమింగ్ రూల్స్ ఖరారు అవుతాయి. ‘ధురంధర్’ మేకర్స్ ముందే కుదుర్చుకున్న ఓటీటీ ఒప్పందం ప్రకారం.. ఇప్పుడు కొత్తగా ఇతర భాషల్లోకి (ముఖ్యంగా తెలుగులోకి) డబ్ చేసి థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ బ్లాక్ బస్టర్‌ను వెండితెరపై చూడాలన్న ఆశ నెరవేరడం కష్టమేనని కనిపిస్తోంది.
Also Read :Manchu Lakshmi: సీఐడీ ఆఫీస్‌లో మంచు లక్ష్మి.. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ!
మొదటి భాగం తెలుగులోకి రాకపోయినా, దీని సీక్వెల్ మాత్రం పక్కాగా తెలుగులో ఉంటుందని సమాచారం. ఎందుకంటే ‘ధురంధర్ 2’ను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్‌ను 2026, మార్చి 19న విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. రెండో భాగం మాత్రం తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఒకేసారి థియేటర్లలోకి రానుంది. 2025 ఏడాదికి సంబంధించి ‘ధురంధర్’ టాప్ గ్రాసర్‌గా నిలిచింది. అలాగే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, ‘ధురంధర్’ త్వరలోనే ₹1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల మార్కును అందుకోలేదు, ఆ లోటును ‘ధురంధర్’ భర్తీ చేసేలా ఉంది.