ఇండియన్ ఐడల్ 12 సీజన్ ముగిసింది. పవన్ దీప్ రాజన్ విజేతగా నిలిచాడు. ఫైనల్ కి చేరిన ఆరుగురిలో ఆయన నంబర్ వన్ గా ట్రోఫిని స్వంతం చేసుకున్నాడు. పాతిక లక్షల ప్రైజ్ మనీతో పాటూ మారుతీ వారు బహూకరించిన కార్ కూడా పవన్ స్వంతమైంది.
2021 ఇండియన్ ఐడల్ గా ఘనత సాధించిన పవన్ దీప్ “అంతా కొత్తగా ఉంద”ని చెప్పాడు! తనని విజేతగా ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదని తెలిపాడు. ఇక తాను కాకుండా ఫైనల్ కి చేరిన మిగతా అయిదుగురు కూడా ట్రోఫికి అర్హులేనని అన్నాడు పవన్ దీప్. అందరిలోనూ ఎంతో టాలెంట్ ఉందని అభిప్రాయపడ్డాడు.
ఇండియన్ ఐడల్ సీజన్ 12లో ఫస్ట్ రన్నర్ అప్ గా అరుణిత కంజిలాల్ నిలిచింది. సెకండ్ రన్నర్ అప్ పొజీషన్ లో సయాలీ కాంబ్లీ సత్తా చాటింది. ఇక నాలుగు, అయిదు స్థానాల్లో మహ్మద్ దానిష్, నిహాల్ తౌరో చొటు దక్కించుకున్నారు. తెలుగు అమ్మాయి షణ్ముఖప్రియ ఆరవ స్థానంతో చివరి పొజీషన్లో మిగలాల్సి వచ్చింది.