కాబూల్‌లో ప్రస్తుం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా ఆ తరువాత ఎలాంటి సంఘటనలు జరుగుతాయే, మహిళలను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. అందుకోసమే వీలైనంత వరకు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఎంబసీలు మూసేయ్యడంతో విదేశాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీనికోసం భారత ప్రభుత్వం ఇ ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీనికోసం […]
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో రాజధాని కాబూల్‌లోని అన్ని దేశాలు తమ ఎంబసీలను ఖాళీ చేసి స్వదేశం వెళ్లిపోతున్నాయి. అధికారులను, భద్రతా సిబ్బందిని స్వదేశానికి తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కాబూల్ విమానశ్రయం నుంచి భారత రాయబార అధికారులు, భద్రతా సిబ్బంది 120 మందిని సీ 17 వైమానిక విమానం ద్వారా ఇండియాకు తరలించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు సీ 17 విమానం చేరుకున్నది. కాబూల్ నుంచి వచ్చిన వీరికి విదేశాంగ శాఖాధికారులు స్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న […]
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా భయం భయంగా తిరుగుతున్న ప్రజలు కనిపిస్తున్నారు. ఎవరు ఎటునుంచి వచ్చి కాల్పులు జరుపుతారో… ఎవర్ని ఎత్తుకుపోయి చంపేస్తారో.. ఏ మహిళ కనిపిస్తే ఏం చేస్తారో అని భయాందోళనల మధ్య కాలం వెల్లబుచ్చుతున్నారు. కాబూల్ నగరం చుట్టూ తాలిబన్లు పహారా కాస్తుండటంతో బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు. ఇప్పుడున్న ఏకైక మార్గం కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో ఏదోక దేశం వెళ్ళి తలదాచుకోవడమే. దీంతో పెద్ద సంఖ్యలో ఆఫ్ఘన్ ప్రజలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. […]
ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటి వరకు సాగిన పాలనకు పూర్తి విరుద్దంగా పాలన జరగబోతున్నది. తాలిబన్ల చేతిల్లోకి అధికారం వెళ్లిపోయింది. రెండు దశాబ్దాల క్రితం ఎలాంటి కౄరమైన పాలనను అక్కడి ప్రజలు చూశారో దాదాపుగా అదేవిధమైన పాలనలను మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు. తాము శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలు కోరుకుంటున్నామని చెబుతున్నప్పటికీ వారు ఎలాంటి పాలన అందిస్తారో అందరికీ తెలిసిందే. మహిళలు, చిన్నపిల్లలకు ఆ దేశంలో రక్షణ ఉండదు. 12 ఏళ్లు దాటిన మహిళలు ఎవరూ బయటకు రాకూడదు. చదువు […]
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఇండియాలో 25,166 కేసులు నమోదవ్వగా, 437 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దాదాపు 5 నెలల తరువాత 25 వేల కేసులు నమోదవ్వడం విశేషం. ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.22 కోట్లకి చేరింది. తాజాగా కరోనా నుంచి 36,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.14 కోట్లకు చేరింది. […]
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వస్తుండటంతో వేగంగా వ్యాక్సినేషన్ ను అమలు చేస్తున్నారు. దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా, మరో మూడు వ్యాక్సిన్లకు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. భారత్‌కు చెందిన జైడస్ క్యాడిలా, కోవాక్స్, స్పుత్నిక్ లైట్‌లు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీకి ధరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మొదటగా భారత్‌కు చెందిన జైడస్ […]
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక ఆక్కడ పరిస్థితులను రష్యా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. 2001 కి ముందు కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను పరిపాలించారు. అయితే, వారి అరాచక పాలన ఎంతో కాలం సాగలేదు. 2001లో ఉగ్రవాదులు అమెరికా వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై దాడులు చేసి కూల్చివేసిన తరువాత అమెరికా సైన్యం ఆఫ్ఘన్ లోకి అడుగుపెట్టి తాలిబన్లను తరిమికొట్టింది. అంతకు ముందు అంటే, 1979 ప్రాంతంలో అఫ్ఘన్‌కు రష్యా సహకారం అందించింది. ఆప్రాంతాన్ని సోవియట్ యూనియన్ తమ ఆధీనంలోకి […]
మేషం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విదేశాల నుంచి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృషభం : కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. […]