ఏకే 47, రాకెట్ లాంచర్లు ఉంటేనే ఆఫ్ఘనిస్తాన్‌ను గజగజవణికిస్తున్నారు. అదే అధుతాన ఆయుధాలు, వైమానిక ఆయుధసంపత్తి ముష్కరుల చేతికి దొరికితే ఇంకేమైనా ఉన్నదా… ఆఫ్ఘన్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. గత 20 ఏళ్ల కాలంలో 89 బిలియన్ డాలర్లతో ఆఫ్ఘనిస్తాన్‌కు అమెరికా అధునాత ఆయుధాలు, యుద్ద విమానాలు, హెలికాఫ్టర్లు, యుద్ధ ట్యాంకులు, 11 వైమానిక స్థావరాలను సమకూర్చింది. ఎలా వీటిని వినియోగించాలో సైనికులను తర్ఫీదు ఇచ్చింది. సైనిక శిక్షణ ఇచ్చింది. ఇన్ని చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం […]
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలు తప్పుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సెప్టెంబర్ 11 వరకు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రక్రియను అమెరికా వేగవంతం చేయడంతో తాలిబన్లు దురాక్రమణకు పాల్పడ్డాయి. వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాయి. ఆదివారంరోజున రాజధాని కాబూల్ నగరంలోకి ప్రవేశించడంతో ఆఫ్ఘన్ తాలిబన్ల వశం అయింది. ఈ పరిస్థితికి అమెరికానే కారణం అని ప్రపంచం మొత్తం విమర్శలు చేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ […]
ఎప్పుడైతే అమెరికా సేనలు తప్పుకుంటున్నట్టు ప్రకటించాయో అప్పటి నుంచి తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వారాల వ్యవధిలోనే తాలిబన్లు ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆదివారం రోజున తాలిబన్లు కాబూల్ శివారు ప్రాంతానికి చేరుకోగా, సోమవారం నాడు కాబూల్‌లోకి వచ్చారు. అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన తరువాత తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగిసిందని, ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాహిదీన్‌లకు మంచిరోజులు వచ్చాయని అంతర్జాతీయ మీడియాతో తెలిపారు. శాంతియుతమైన పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్ నేతలు, త్వరలోనే […]
కాబూల్ లో ప్రస్తుతం పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. వేగంగా అధికార మార్పిడి జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తరువాత శాంతిని, అభివృద్దిని తీసుకొస్తామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ ఎవరికి నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటే, 1994 లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాలనలోకి వచ్చిన సమయంలో కూడా ఇదే విధమైన హామీ ఇచ్చారు. కానీ, ఆ వెంటనే అరాచకాలు సృష్టించారు. వారి నాలుగేళ్ల పాలనలో ఆఫ్ఘన్ వాసులు ఘోరంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా […]
ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం ఆఫ్ఘనిస్తాన్, దానిని ఆక్రమించుకున్న తాలిబన్లపైనే ఉన్నది. 2001 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు రక్షణ కల్పిస్తూ వచ్చాయి. ఆఫ్ఘన్ సైన్యానికి అధునాతన ఆయుధాలతో పాటుగా, ఎలా పోరాటం చేయాలనే ట్రైనింగ్‌ను ఇచ్చారు. కానీ, అవేమి తాలిబన్ల ముందు పనిచేయలేకపోయాయి. 20 ఏళ్లతో ఆఫ్ఘన్‌లో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఏమౌతుందో అని భయపడుతున్నారు. 2001 నుంచి 2021 వరకు తాలిబన్లు పెద్దగా ప్రభావం చూపించకపోయినా, ఉనికిని […]
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కాబూల్‌లోకి తాలిబన్లు చొచ్చుకొస్తున్నారని వార్తలు అందటంతో వేలాది మంది పౌరులు దేశాన్ని వదలి వెళ్లేందుకు సిద్దమయ్యాయి. వేలాది మంది పౌరులు ఎయిర్ పోర్టుకు చేరుకొని విమానాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారికి కంట్రోల్ చేసేందుకు ఆమెరికా ఆర్మీ గాల్లోకి కాల్పులు జరిపింది. ద దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఇక ఇదిలా ఉంటే, […]
ఆగస్టు 14 వ తేదీన పాక్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటే, ఆగస్ట్ 15 వ తేదీన ఇండియా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నది. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అసేతు హిమాచలం మొత్తం ఈ వేడుకల్లో పాల్గొన్నది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇండియా పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. నిఘాను, భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఆదివారం సాయంత్రం రోజున పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా సనోడా గ్రామంలో పంటపొలాల్లో పాక్ బెలూన్లు కనిపించాయి. […]
తాలిబన్లు కాబూల్‌లోకి చొచ్చుకొస్తుండటంతో అన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నాయి. తమ ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు పెద్ద ఎత్తున విమానాలను సిద్దం చేశారు. ఆర్మీ హెలికాప్టర్లు, విమానాలు అన్నింటిని స్వదేశానికి తరలించేందుకు కాబూల్ ఎయిర్‌పోర్టులో ఉన్నాయి. అయితే, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తొలుత వారి దేశానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్రిటన్ తమ వారిని తరలించిన తరువాతే మిగతావారిని తరలిస్తామని చెబుతుండటంతో ఆఫ్ఘన్‌లు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో […]