ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆదివారం రోజున దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన వెళ్తూ 116 మిలియన్ డాలర్లను, ఖరీదైన కార్లను తనవెంట తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి. పలు దేశాలు ఈ విధమైన ఆరోపణలు చేశాయి. తజికిస్తాన్, రష్యాలు ఈ విధమైన ఆరోపణలు చేశాయి. అయితే, దీనిపై ఆఫ్రాఫ్ ఘనీ స్పందిచారు. తాను తన స్వార్ధం కోసం దేశాన్ని విడిచి రాలేదని, దేశంలో రక్తపాతం జరగకూడదని దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినట్టు తెలిపారు. ప్రమాదం ముంచుకొస్తోందని భత్రతా సిబ్బంది […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకునే ముందు రోజే అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. సంచుల నిండా ధనం, కార్లతో ఆయన దేశం విడిచి హెలికాఫ్టర్‌లో వేరే దేశానికి వెళ్లిపోయాడు. అయితే, ఆయన ఏ దేశంలో ఉన్నాడు అన్నది బయటకు రాలేదు. తాజాగా మాజీ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనికి యూఏఈ ఆశ్రయం ఇచ్చినట్టు పేర్కొన్నది. మానవతా దృక్పదంతో ఘనీకి ఆశ్రయం ఇచ్చినట్టుగా ఆ దేశం తెలియజేసింది. అయితే, ఘని ఏ నగరంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో […]
కేంద్ర పౌరయానశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 33 రోజుల్లోనే మధ్యప్రదేశ్‌కు 44 విమానాలను తీసుకొచ్చారు. మధ్యప్రధేశ్‌లోని చిన్న చిన్న నగరాల్లో కూడా విమానాశ్రాలు ఏర్పాటు చేయడంపై దృష్టిసారించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జబల్పూర్ నుంచి ముంబై, పూణే, సూరత్, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు విమానాలు నడుస్తున్నాయని, ఆగస్టు 20 నుంచి ఢిల్లీ, ఇండోర్‌లకు కూడా విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇక 44 విమానాల్లో 8 విమానాలు ఉడాన్ పథకం కింద అందుబాటులోకి […]
కర్నూలు జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన మూడు ఇళ్లలో వరసగా మంటలు చెలరేగాయి. ఒక ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో వాటిని ఆర్పివేయగా పక్కనే ఉన్న మరో ఇంట్లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పివేయగా మూడో ఇంట్లోకూడా అదే విధంగా మంటలు చెలరేగడంతో కుటుంబసభ్యులు భయపడ్డారు. ఇంట్లోని వస్తువులను బయటపడేసి బయటే కూర్చుండిపోయారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని కోడుమూరులోని ఒకటో వార్డులో జరిగింది. ఈ వార్డులో నివశించే ఖాజావలి, […]
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే పాక్ అక్కడ కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఒకవైపు కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెబుతూనే, ఆఫ్ఘనిస్తాన్-పాక్ సరిహద్దుల్లో 2600 కిలోమీటర్ల మేర అత్యంత వేగంగా ఇనుప కంచెను నిర్మించింది. 2 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల ఎత్తులో కంచెను నిర్మించింది. అంతేకాదు, ఈ సరిహద్దు వెంట 1000 చెక్ పోస్టులు, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసింది. కేవలం 16 ప్రాంతాల నుంచి మాత్రమే […]
2001లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలో ఉండగా బమియన్ లోని బుద్ధుని భారీ విగ్రహాన్ని పేల్చివేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అదే బమియన్‌లోని హజారా జాతి నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రహాన్ని బాంబులతో పేల్చివేశారు. హజారా జాతికి చెందిన వ్యక్తులు అప్పట్లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హజరాజత్ అనే పర్వత ప్రాంతాల్లో నివశించే ప్రజలను హజారాలు అని పిలుస్తారు. మంగోల్ సామ్రాజ్యస్థాపకుడు ఛెంగిజ్ ఖాన్ వారసులు. 13 వ శతాబ్ధం నుంచి ఈ […]
1994లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. అమెరికా, నాటో దళాలు తాలిబన్లపై యుద్దం ప్రకటించిన తరువాత తాలిబన్లు వేగంగా వైదొలిగారు. 20 ఏళ్లు ప్రజాస్వామ్య పాలన సాగింది. ఎప్పుడైతే ఆఫ్ఘన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమెరికా ప్రకటించిందో అప్పటి నుంచి తాలిబన్లు ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. కేవలం పది నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక సరా ఖేటా అనే దళం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఫష్తో […]