హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పెళ్లికి పెద్దలు నిరాకరించారనీ ఆత్మహత్య యత్నం చేసింది జంట. అయితే ప్రియురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రియుడు గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఒంగోలు కు చెందిన నాగ చైతన్య , కోటి రెడ్డి ప్రేమించుకున్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తోంది నాగ చైతన్య. మెడికల్ రెప్రజెంటేటివ్ గా చేస్తున్నాడు కోటి రెడ్డి. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు […]
ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అంటారు. ప్రతిరోజూ ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని ఆలోచనలను అమలు చేయగలిగితే మనిషి లైఫ్ వేరుగా ఉంటుంది. ఆలోచనలు పాతవే కావొచ్చు. వాటిని కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు. బెంగళూరుకు చెందిన పూర్ణా సాకర్ అనే యువతి 2015లో కొంతమందితో కలిసి రిపేర్ కేఫ్ అనే స్వచ్చంధ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఇంట్లో పాడైపోయిన వస్తువులను రిపేర్ చేయడమే. ప్రతీ ఆదివారం రోజున ఓ […]
విశాఖ మన్యంలో రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు సామాన్య గిరిజనులు. ఇక గర్భిణీల బాధలు అన్నీ ఇన్నీ కావు. పురిటి నొప్పులతో నిండు గర్భవతి పాపకు జన్మనిచ్చి తిరిగిరాని లోకాలకు చేరింది. ఆ గిరిజన మహిళ మృతి చెందడంతో ఆ చిన్నారితో మరో ముగ్గురు పిల్లలు తల్లిలేని వారయ్యారు. అంబులెన్స్‌కి ఫోన్ చేసిన రహదారి లేని కారణంతో అది రాలేదు. దీంతో ఆ గర్భిణీ నరకయాతన అనుభవించింది. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం […]
సాధారణంగా ఏదైనా ప్రమాదంలో వ్యక్తి చనిపోతే అతని భార్య లేదా పిల్లలకు, లేదా తల్లిదండ్రులకు పరిహారం పొందే హక్కు వుంటుంది. అయితే అల్లుడి దగ్గర అత్త నివాసం ఉంటే మాత్రం ఆమెకు కూడా నష్టపరిహారం పొందేందుకు అర్హురాలేనని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త కూడా అతనికి చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందడానికి ఆమె అర్హురాలేనని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ […]
ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రేమలో ఉన్న గొప్పదనం తెలిస్తే అది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఎన్ని విజయాలైనా సాధించేలా చేస్తుంది. ప్రేమ ఎప్పుడు ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓ వివాహితకు, మరో వ్యక్తికి మధ్య ప్రేమ చిగురించవచ్చు. వారి మనసులు కలిసిపోవచ్చు. చెప్పలేం. ఇలానే ఓ వివాహితతో ఓ వ్యక్తికి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను ఆ వ్యక్తి చాలా అందంగా లేఖలో ఇలా వర్ణించాడు. […]
ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. బెయిల్ వస్తుందా? రాదా? అనేది హిందీ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడైన ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై ఆర్ధర్ రోడ్ జైల్లో ఉన్నాడు ఆర్యన్ ఖాన్. అక్టోబర్ 2న అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ […]
మనదేశంలో జనాభా ఎక్కువ. 130 కోట్ల మంది జనాభా కలిగిన మనదేశంలో సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే మామూలు విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. దానికోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇక్కడే కాదు ఏ దేశంలో అయినా సరే ఇల్లు కట్టుకోవడం అంటే మాటులు కాదు. అందులోనూ ఇండివిడ్యువల్‌గా ఇల్లు కావాలంటే మరింత డబ్బు ఖర్చు చేయాలి. అయితే, ఆస్ట్రేలియాలోని క్విల్పీ అనే పట్టణంలో ఇల్లు కట్టుకోవాలని అనుకునే వారికి స్థలం […]
మితిమీరిన వేగం ఓ మహిళ ప్రాణం తీసింది. నార్సింగి మీర్జాగూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన కారు వేగంగా ముందుకు వెళ్ళబోయింది. స్పాట్ లోనే మృతి చెందింది ఓ మహిళ. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యారు. కారు వదిలేసి పారిపోతున్న డ్రైవర్ ను వెంబడించి పట్టుకున్న స్థానికులు. దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలు అదే ప్రాంతానికి చెందిన పద్మగా గుర్తించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా […]
ప్రపంచంలో అత్యధిక మంది వినియోగిస్తున్న మెసేజ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రీసెంట్‌గా వాట్సాప్ మనీ ట్రాన్స్‌ఫర్‌ను ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, త్వరలోనే మరో ఫీచర్ అందుబాటులోకి వస్తున్నట్టు ఎక్స్‌డీఏ టెక్నాలజీ తెలియజేసింది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో గ్రూప్స్ ఉన్నాయిగాని, గ్రూప్ చాటింగ్ పౌకర్యం లేదు. ఈ గ్రూప్ చాటింగ్ సౌకర్యాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వాట్సాప్. ప్రస్తుతం ఈ వెర్సన్ టెస్టింగ్ దశలో […]
ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల గిరిజనులు ఎమ్మెల్యే రాజన్నదొరను కలిశారు. కొఠియా గ్రూపు గ్రామాలలో తెలుగు బోర్డులు ఏర్పాటు చేస్తుండగా ఒడిశా అధికారులు అడ్డుకుని తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఒడిశాతో ఉండకపోతే కేసులు పెట్టి జైలుపాలు చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ధన మాన ప్రాణరక్షణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను వారు కోరారు. అలాగే ఐటిడిఎ పిఓ , జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేస్తామని గిరిజనులు తెలిపారు. కొఠియా సమస్యపై చీఫ్ […]