ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల గిరిజనులు ఎమ్మెల్యే రాజన్నదొరను కలిశారు. కొఠియా గ్రూపు గ్రామాలలో తెలుగు బోర్డులు ఏర్పాటు చేస్తుండగా ఒడిశా అధికారులు అడ్డుకుని తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఒడిశాతో ఉండకపోతే కేసులు పెట్టి జైలుపాలు చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మా ధన మాన ప్రాణరక్షణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను వారు కోరారు. అలాగే ఐటిడిఎ పిఓ , జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేస్తామని గిరిజనులు తెలిపారు. కొఠియా సమస్యపై చీఫ్ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్ దృష్టి సారించి గిరిజనులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
అనంతరం పార్వతీపురం ఐటీడీఏ వద్ద కు చేరుకున్న కొఠియా పరిసరప్రాంతాల గిరిజనులు నినాదాలు చేశారు. వారికి ఘనంగా స్వాగతం పలికిన ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్, అధికారులు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వయంగా భోజనం వడ్డించారు పివో ఐటీడీఏ, అధికారులు.