Pakistan Nuclear: భారత్ చెప్పిందే నిజం.. పాకిస్తాన్ అణు లీకేజీపై అమెరికా- రష్యా ఆందోళన
- పాకిస్తాన్ అణు పరీక్షలపై అమెరికా, రష్యా అనుమానాలు..
- డీక్లాసిఫై చేసిన అమెరికా భద్రతా పత్రాల్లో 20 ఏళ్ల క్రితం నాటి ముచ్చట్లు..
- భారత్ చెప్పిందే నిజం.. పాకిస్తాన్ అణు లీకేజీపై అమెరికా- రష్యా ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Nuclear: పాకిస్తాన్ అణు పరీక్షలపై 20 ఏళ్ల క్రితమే యూఎస్, రష్యా ప్రభుత్వాలు అంతర్గతంగా చర్చించుకున్న విషయాలు తాజాగా డీక్లాసిఫై చేసిన అమెరికా భద్రతా పత్రాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ అంతర్జాతీయ వేదికలపై పదే పదే హెచ్చరించిన అంశాలనే ఈ పత్రాలు బలపరుస్తున్నాయి. ఈ వారం National Security Archive విడుదల చేసిన ట్రాన్స్క్రిప్ట్‌ల ప్రకారం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ 2001 నుంచి 2008 మధ్య జరిగిన అనేక ఉన్నత స్థాయి సమావేశాల్లో పాకిస్తాన్ అణు ఆయుధాల స్థిరత్వం, భద్రత, అణు పాలసీపై ప్రధానంగా చర్చించారు.
Read Also: Bans Harmful Chemicals in Agarbatti : అగరబత్తుల తయారీపై కేంద్రం సంచలన నిర్ణయం
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అయితే, 2001 జూన్ 16వ తేదీన స్లోవేనియాలో జరిగిన తొలి భేటీలోనే ఇరాన్, ఉత్తర కొరియా, NATO విస్తరణ లాంటి అంశాలతో పాటు పాకిస్తాన్‌పై తన అనుమానాలను పుతిన్ వెల్లడిస్తూ, “పాకిస్తాన్ అణు ఆయుధాలు కలిగిన మిలిటరీ జుంటా.. అది ప్రజాస్వామ్యం కాదు.. అయినా పశ్చిమ దేశాలను విమర్శించడం లేదని బుష్‌తో అన్నట్లు ఆ పత్రాల్లో ఉంది. ఇక, 2005లో Oval Officeలో జరిగిన సమావేశంలో పుతిన్ మరో కీలక విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్ సెంట్రిఫ్యూజ్‌లలో లభించిన యురేనియం పాకిస్తాన్ మూలం నుంచి వచ్చిందని చెప్పారు. దీనిపై బుష్ స్పందిస్తూ, ఇది అణు నిబంధనల ఉల్లంఘనే.. ఇది మాకు నర్వస్‌గా ఉందని వ్యాఖ్యానించగా, పుతిన్ స్పందిస్తూ.. మా పరిస్థితి కూడా ఆలోచించండి.. అణు లీకేజీ ప్రభావాలు చాలా పెద్దవి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: God of War : ఎన్టీఆర్ – బన్నీ – త్రివిక్రమ్.. అసలేం జరుగుతోంది?
కాగా, ఈ అణు లీకేజీ అంశాన్ని అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌తో కూడా జార్జ్ బుష్ వ్యక్తిగతంగా చర్చించినట్లు ఆ రికార్డుల్లో ఉంది. భారత్ చాలా కాలంగా పాకిస్తాన్ అణు వ్యాప్తి, అణు సాంకేతికత ఉగ్రవాద సంస్థలకు చేరే ప్రమాదంపై హెచ్చరికలు చేస్తుంది. తాజా డీక్లాసిఫై పత్రాలను చూస్తుంటే.. ఇండియా లేవనెత్తిన భయాలు కేవలం ప్రాంతీయ సమస్య కాదని, అవి ప్రపంచ స్థాయి అణు స్థిరత్వానికి సంబంధించినవని మరోసారి స్పష్టమవుతుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!