మనదేశంలో జనాభా ఎక్కువ. 130 కోట్ల మంది జనాభా కలిగిన మనదేశంలో సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే మామూలు విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. దానికోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇక్కడే కాదు ఏ దేశంలో అయినా సరే ఇల్లు కట్టుకోవడం అంటే మాటులు కాదు. అందులోనూ ఇండివిడ్యువల్‌గా ఇల్లు కావాలంటే మరింత డబ్బు ఖర్చు చేయాలి. అయితే, ఆస్ట్రేలియాలోని క్విల్పీ అనే పట్టణంలో ఇల్లు కట్టుకోవాలని అనుకునే వారికి స్థలం ఉచితంగా ఇస్తారట. దానికి కొన్ని కండీషన్స్ ఉన్నాయి. ఇల్లు కట్టుకునే వారు తప్పనిసరిగా అక్కడే ఉండాలి. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి. స్థానికంగా ఉద్యోగాలు చేసేందుకు ఒప్పుకోవాలి. ఈ కండీషన్స్‌కు ఒప్పుకుంటే ఏ దేశం నుంచి వచ్చిన వారికైనా అక్కడ స్థలం ఇస్తారట. ఉచితంగా స్థలం పొందిన వారు తప్పనిసరిగా ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇంటికి 7,50,000 ఆస్ట్రేలియా డాలర్లకు మించి ఖర్చు చేయకూడదు. స్థలం తీసుకొని ఇల్లు నిర్మించుకున్నవారు ఆ ఇంట్లో తప్పనిసరిగా ఆరునెలలు నివశించాలి. ఇక క్విల్పీ పట్టణంలో నర్సులు, టీచర్లు, మెకానిక్, వ్యాపారులు, ట్రెడ్ అప్రెంటిస్, బార్ అటెండర్స్ కొరత తీవ్రంగా ఉన్నది. ఎవరు వచ్చినా అక్కడ నివశించకుండా వెళ్లిపోతున్నారు. దీంతో ఈ అక్కడి అధికారులు ఈ ఆఫర్‌ను ప్రకటించారు.
Read: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్… ఎలా ఉండబోతుందంటే…