తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పరిపూర్ణానంద స్వామీజీ. కరోనా బారినుండి ప్రజలు కాపాడి,తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలని స్వామిని వేడుకున్నానని చెప్పారు. తిరుమల కొండపై ఆహ్లాదకరమైన, అభివృద్ధిని పెంపొందిస్తూ టీటీడీ పటిష్టమైన నియమ నిబంధనలు కొనసాగించాలన్నారు. టీటీడీ మరిన్ని ధార్మిక కార్యక్రమాలను మంచి ఉత్సాహంతో ముందుకు కొనసాగించాలని స్వామిని కోరుకున్నానని పరిపూర్ణానంద స్వామీ చెప్పారు.గతంలో నిర్లక్ష్యానికి గురైన వకుళా మాత ఆలయాన్ని చాలా అద్భుతంగా పునరుద్ధరణ చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి […]
మన పెద్దలు ఎక్కువగా వేడినీళ్ళు తాగేవారు. కానీ ఇప్పుడు చాలామంది వేడినీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. వేడి నీళ్ళు కొన్ని అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా ఎక్కువగా నీరుత్రాగడం వల్ల కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది . వేడి నీళ్ళు లేదా గోరువెచ్చనీ నీరు త్రాగడం వల్ల అందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. వేడినీళ్ళను వదిలేసి, చల్లటి నీరు త్రాగడంలో ప్రయోజనం లేదు. ఆరోగ్య నిపుణులు రోజుకు 7-8గ్లాసుల నీరు […]
ఎప్పుడూ ఎవరూ కూడా ఉచితంగా ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఒకవేళ అలా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశాల్లో ఇవ్వొచ్చు. అంతేగాని, చైనాలాంటి దేశాల్లో ఉచితంగా సలహాలు ఇస్తే ఏం జరుగుతుందో, ఎంత నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందో జాక్‌మా వంటి వ్యక్తులకు బాగా తెలుసు. జాక్‌మా చైనా జెయింట్ దిగ్గజ సంస్థ అలిబాబా వ్యవస్థాపకుడు. ఆయన రోజువారి ఆదాయం వందల కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే, అక్టోబర్ 24, 2020న ది బండ్ […]
కర్నూలు జిల్లా ఆత్మకూరులో వర్ధన్ సొసైటీ మోసాలపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. వర్ధన్ సొసైటీ మన బ్యాంకే అని చెప్పాను. కానీ డిపాజిట్లు చేయండని చెప్పలేదని ఆయన చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నోరు మూసుకుంటే మంచిదని లేకపోతే ఆయన చిట్టా అంతా విప్పుతానని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి విరాళాలు ఇస్తే తీసుకుంటామని, అందులో తప్పేముందని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. వర్ధన్ సొసైటీ నిర్వహకుడు […]
ఏపీలో మహిళలు, మహిళా ఉద్యోగినులు, పాఠశాలల్లో విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కీచక ఉపాధ్యాయుల భరతం పట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల వరుసగా జరిగిన వేధింపుల ఘటనలపై వాసిరెడ్డి స్పందించారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. గుంటూరు రూరల్ పోలీసు ఉన్నతాధికారులతో పాటు మాచవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో మాట్లాడి […]
మేషం :- బ్యాంకు వ్యవహారాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, పనిభారం తప్పవు. మీ కళత్ర సహకారంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. ఎదుటివారి ఆంతర్యాన్ని గమనించి ముందుకుసాగండి. మీ బలహీనతలు, ఆగ్రహావేశాలు ఇబ్బందులకు దారితీసే ఆస్కారం ఉంది. వృషభం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంలబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. […]
లేడీ డైరెక్టర్ సుధ కొంగర, సౌత్‌లో డిఫరెంట్ కథలతో సినిమాలను ఎంచుకునే సూర్య కాంబినేషన్ మరోసారి రీపీట్ అవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ ” ఆకాశం నీ హద్దురా ” సినిమాతో సూపర్ హిట్‌తో పాటు ఎన్నో అవార్డులు సాధించారు. సుధ కొంగర మరోసారి సూర్యను డైరెక్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కథ చర్చలు ఈ మధ్యనే ముగిసినట్టు సమాచారం. ఇదే జరిగితే వారి ఖాతాలో మరో భారీ హిట్టు పడటం ఖాయమంటున్నాయి […]
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలు బూతు పురాణాల రాజకీయంతో జనాలకు అసహ్యం వేస్తుంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కొడాలి నాని, వల్లభనేని వంశీని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత ఉద్దేశించి వల్లభనేని వంశీ, కొడాలి నాని పశువులకన్నా హీనంగా మాట్లాడారు… జగన్ అరాచక పాలనపై మేము మా నాయకుడు చంద్రబాబు నాయడు మాట్లాడితే మాపై శాపనార్థాలు పెడతారా అంటూ దేవినేని ఉమ […]
సమంత విడాకుల సందర్భంగా పలు యూ ట్యూబ్ ఛానల్స్ చేసిన వీడియోలు తప్పుడు ప్రచారాలు చేశాయని తమ పరువుకు భంగం వాటిల్లిందని సమంత కేసు వేశారు. కేసును కూకట్‌పల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోసారి వాదనలు వినిపించిన సమంత తరపు న్యాయవాది బాలాజీ ఈ సందర్భంగా మాట్లాడారు. సమంత ప్రతిష్ఠ ను దెబ్బతీసిన మూడు యూ ట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని కోర్టుకు తెలిపామన్నారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి పై […]
హుజురాబాద్ బై పోల్‌కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారం జోరును పెంచాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ తెలుగు తల్లి ముందు మోకరిల్లిండన్నారు. తెలుగు తల్లిని బరితెగించి తిట్టిన కేసీఆర్ ప్లీనరీలో పెట్టిన స్వాగత తోరణంలో పెట్టింది తెలుగు తల్లినే అని అన్నారు. గులాబీ చీడకు పెట్టుబడి పెట్టింది ఆంధ్ర కాంట్రాక్టర్లు అందుకే తెలుగుతల్లి తోరణం పెట్టారన్నారు. టీఆర్ఎస్ ఉద్యమం ముసుగులో రాజకీయ పార్టీగా ఎదగడానికి ఎందరినో […]