ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకే ఒక్క సినిమా స్క్రిప్ట్ ఇద్దరు స్టార్ హీరోలు ఒక స్టార్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసిన భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ. గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న వార్తలు అటు ఎన్టీఆర్, ఇటు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద రచ్చకే దారితీశాయి. నిజానికి’గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ తదుపరి సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుందని అందరూ ఆశించారు. కానీ అనూహ్యంగా బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్టును అట్లీతో ప్రకటించడంతో త్రివిక్రమ్ ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వెంకటేష్ ఒక సినిమా మొదలు పెట్టి దాదాపు ఏడాది కాలం వృధా అయిన తర్వాత, త్రివిక్రమ్ అదే మైథలాజికల్ టచ్ ఉన్న కథను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. గతంలో ఒక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా కూడా, ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించడంతో ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అని అందరూ భావించారు.
Also Read: Anasuya: మీడియా ‘రాబందులు’.. నా భర్తని, పిల్లలని లాగుతున్నారు.. అనసూయ షాకింగ్ కామెంట్స్
ఎన్టీఆర్‌తో సినిమా ఓకే అనుకున్నా, ఇక్కడ హీరో డేట్స్ పెద్ద సమస్యగా మారాయి. ఎందుకంటే ఎన్టీఆర్ చేతిలో, ‘ప్రశాంత్ నీల్ డ్రాగన్’, ‘దేవర 2’ సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాతే త్రివిక్రమ్ మూవీ ఉండాలి. కానీ నీల్ సినిమా అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఒకవేళ ఈ లోపు ‘దేవర 2’ మొదలైతే, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ 2028 వరకు వెళ్లే ప్రమాదం ఉంది. త్రివిక్రమ్ మాత్రం 2026 సమ్మర్ నాటికే సిద్ధంగా ఉండాలని చూస్తున్నారు. అంత కాలం వెయిట్ చేయడం ఆయనకు ఇష్టం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బన్నీ 2026 సమ్మర్ కు ఫ్రీ అవుతున్నారనే వార్త బయటకు రావడంతో త్రివిక్రమ్ మళ్లీ బన్నీ క్యాంప్ వైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి: అందులో ఒకటి టైం, మరోటి మార్కెట్. మార్కెట్ విషయానికి వస్తే కనుక ఎన్టీఆర్ మార్కెట్ రూ. 500 కోట్ల రేంజ్‌లో ఉంటే, బన్నీ ‘పుష్ప’తో రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయారు. ఇలాంటి భారీ మైథలాజికల్ సినిమాకు బన్నీ మార్కెట్ పెద్ద ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ ఆలోచన కావచ్చని అంటున్నారు. ఎన్టీఆర్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం కంటే, ఫ్రీగా ఉన్న బన్నీతో ముందుకు వెళ్లడం మేలని భావిస్తున్నట్లు కూడా ఒక ప్రచారం ఉంది.
Also Read: The Raja Saab: అలాంటి ఎపిసోడ్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాలేదు: మారుతి
ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు త్రివిక్రమ్‌ను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఎవరూ లేని సమయంలో ‘అరవింద సమేత’తో ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారని, ఇప్పుడు త్రివిక్రమ్ ఇలా హ్యాండివ్వడం సరికాదని మండిపడుతున్నారు. ఒకవేళ త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీ వైపు వెళ్తే, భవిష్యత్తులో ఎన్టీఆర్ తలుపులు త్రివిక్రమ్‌కే కాకుండా, హారిక హాసిని బ్యానర్‌కు కూడా మూతపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిజానికి ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఊగిసలాటలో ఉందని అంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ ‘దేవర 2’ని పక్కన పెట్టి, ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్‌తో సినిమా చేస్తారా? లేదా మరి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం వేచి ఉంటారా? లేక బన్నీ దగ్గరకు వెళ్తారా ? ఏమవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.