ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రేమలో ఉన్న గొప్పదనం తెలిస్తే అది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఎన్ని విజయాలైనా సాధించేలా చేస్తుంది. ప్రేమ ఎప్పుడు ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓ వివాహితకు, మరో వ్యక్తికి మధ్య ప్రేమ చిగురించవచ్చు. వారి మనసులు కలిసిపోవచ్చు. చెప్పలేం. ఇలానే ఓ వివాహితతో ఓ వ్యక్తికి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను ఆ వ్యక్తి చాలా అందంగా లేఖలో ఇలా వర్ణించాడు. “నా ప్రియాతి ప్రియతమా, ప్రతి ఉదయం నన్ను నువ్వు చూడటానికి వచ్చేందుకు ప్రయత్నిస్తావా? ఈ ప్రేమ మన ఇద్దరి మధ్యే రహస్యంగా ఉండాలి. ఎందుకంటే నీకు ఇప్పటికే పెళ్లి అయింది కదా.. అది వేరే సమస్యలు తీసుకువస్తుందేమో. నువ్వు నన్ను కలువు అని ప్రతిరోజూ అనొద్దు, కానీ కలుసుకోవాలనుకుంటే ట్రామ్ కార్నర్ వద్ద అర్ధరాత్రి కలుద్దాం. త్వరలో మళ్లీ కలుద్దాం. ఇట్లు.. నీ ముద్దల ప్రియుడు రోనాల్డ్” అని వర్ణించాడు.
Read: అక్కడ ఇల్లు కట్టుకుంటే స్థలం ఫ్రీ…
అయితే, ఈ ప్రేమ లేఖ ఇప్పటిది కాదు. సుమారు వందేళ్ల క్రితం నాటి ప్రేమలేఖ. బ్రిటన్ కు డాన్ కార్న్స్ అనే మహిళ ఓ పాత ఇంట్లో నివశిస్తున్నది. ఆ ఇల్లు కట్టి సుమారు వందేళ్లకు పైగా అవుతున్నది. ఆ ఇంట్లో ఓ పాత టీవీ కిందపడటంతో ఫ్లోర్ టైల్స్ పగిలిపోయాయి. వాటిని సరిచేస్తుండగా ఓ లెటర్ బయటపడింది. ఆ లెటర్ లోని రాత పాతకాలానికి చెందినదిగా ఉండటంతో ఆ లెటర్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది ఆ మహిళ. ఆ లెటర్ చూసిన నెటిజన్లు ఎలాగోలా తర్జుమా చేశారు. అందమైన ప్రేమ లేఖ సుమారు 1917 ప్రాంతంలో రాసి ఉంటారని నెటిజన్లు అంచనా వేశారు. వందేళ్లనాటి ప్రేమలేఖ చరిత్రకు మహిళ ఇల్లు సాక్షిగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ లేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.