ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అంటారు. ప్రతిరోజూ ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని ఆలోచనలను అమలు చేయగలిగితే మనిషి లైఫ్ వేరుగా ఉంటుంది. ఆలోచనలు పాతవే కావొచ్చు. వాటిని కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు. బెంగళూరుకు చెందిన పూర్ణా సాకర్ అనే యువతి 2015లో కొంతమందితో కలిసి రిపేర్ కేఫ్ అనే స్వచ్చంధ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఇంట్లో పాడైపోయిన వస్తువులను రిపేర్ చేయడమే. ప్రతీ ఆదివారం రోజున ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఇళ్లలోని పాత వస్తువులను రిపేర్ చేస్తుంటారు. ఈ రిపేర్ కేఫ్‌లో ఇంజనీర్లు దగ్గర నుంచి ప్లంబర్ల వరకు అందరూ ఉంటారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు పాడైపోయినా వాటిని రిపేర్ చేస్తుంటారు. ఇది ఆ ప్రాంతంలో బాగా ఫేమస్ అయింది. అయితే, ఇలా పాత వస్తువులను రిపేర్ చేయడానికి నామమాత్రం ఫీజులు వసూలు చేస్తారు. ఇంటి దగ్గరకే వచ్చి పాత వస్తువులను రిపేర్ చేస్తుండటంతో మంచి ఆదరణ లభిస్తుందని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు పూర్ణా తెలిపారు.
Read: వందేళ్లనాటి ప్రేమలేఖ… ప్రియురాలిని ఎలా వర్ణించారంటే…