భార్య అంటే తనలో సగం. కష్టసుఖాల్లో తోడూనీడగా ఆమె భర్తకు వెన్నంటి వుంటుంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి వివాహం అనే మూడుముళ్ళు, ఏడడుగులతో భర్తతో పాటు పుట్టింటిని వదలి మెట్టినింటికి అడుగులు వేస్తుంది. అక్కడ ఏ కష్టం వచ్చినా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది. భర్తకి కష్టం వస్తే ఆమె ఓదారుస్తుంది. భర్తతోటిదే లోకంగా బతుకుతుంది. కానీ, విధి వైచిత్రితో ఆ భార్య దూరం అయితే ఆ భర్త వేదనకు అంతే వుండదు. ఆమె గురుతులతో కాలం వెళ్ళదీస్తాడు. కానీ ఒక కూతురు తల్లిని మరిచిపోలేక తల్లిని పోలినట్టుగా వుండే విగ్రహాన్ని తయారుచేయించింది. తండ్రికే బహుమతిగా ఇచ్చి అమ్మప్రేమను చాటుకుంది.

విజయవాడలో ఓ కూతురు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. సిలికాన్ వ్యాక్స్ తో తల్లి నిలువెత్తు విగ్రహం చేయించింది. ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో చనిపోయిన అమ్మ అన్నపూర్ణమ్మ గురుతుల్ని మరిచిపోలేక ఆమెకు నిలువెత్తు విగ్రహం చేయించింది. సిలికాన్ వ్యాక్స్ తో రూపుదిద్దుకున్న ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒంటరిగా ఉన్న తండ్రికి, తల్లి పుట్టిన రోజు సందర్భంగా విగ్రహం బహుమతిగా ఇచ్చింది ఆ కూతురు. అచ్చం మనిషి రూపంలో ఉన్న విగ్రహాన్ని చూసి సంతోష పడుతున్నారు కుటుంబసభ్యులు. కూతురుని చేసిన పనికి ఉబ్బితబ్బిబవుతున్నా. భార్య మెమరీస్ గుర్తుచేసుకుంటున్నాడు ఆ భర్త. ఆమె బర్త్ డే సందర్భంగా కుటుంబం అందించిన నిజమైన నివాళి ఈ విగ్రహం.