మేఘాలయ టీఎంసీ ఛీఫ్‌గా ముకుల్ సంగ్మా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITMC)లో మేఘాలయ ముఖ్యమంత్రి డాక్టర్ ముకుల్ సంగ్మా చేరారు. శుక్రవారం షిల్లాంగ్‌లో జరిగిన టీఎంసీ పార్టీ కొత్తగా ఏర్పడిన మేఘాలయ యూనిట్ తొలి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.మొదటి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ముకుల్ సంగ్మాతో సహా మొత్తం 12 మంది శాసనసభ్యులు హాజరయ్యారని ఉమ్రోయ్ నియోజకవర్గ […]
తెలుగు అకాడమీ భారీ స్కాంలో బ్యాంకు సిబ్బంది పాత్ర కీలకంగా ఉందని అధికారులు గుర్తించారు. అకాడమీలోని లక్షల రూపాయల నగదు చేతులు మారిందని దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసును సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. కానీ తెలుగు అకాడమీ కేసులో బ్యాంకు అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఉద్యోగులు కావడంతో సీసీఎస్ విచారణలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్థిక అవకతవకల్లో ప్రభుత్వ సిబ్బంది పాత్ర ఉన్నందున ఈ కేసు దర్యాప్తులో భాగంగా వారిని ఏసీబీ కోర్టులోనే ప్రవేశపెట్టాల్సి […]
వర్షం మాట వింటేనే ఏపీ వణికిపోతుంది. నిన్న మొన్నటి దాకా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నవాతావరణ హెచ్చరికలతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే […]
అసెంబ్లీలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గపు పని అని టీడీపీపొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీపై విమర్శలు బాణాలు వదిలిన ఆయన.. కౌరవ సభను మళ్ళీ గౌరవ సభగా మారుస్తామన్నారు. చంద్రబాబు కంటతడి జీవితంలో చూడబోమని అనుకున్నాం కానీ వైసీపీ నేతలు దిగజారి చంద్రబాబుపై విమర్శలు చేశారన్నారు. దీనికి వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతూ.. తెలంగాణలో ధాన్యం కొనుగోలులో కేంద్ర రాష్ట్ర […]
కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్‌కు కష్టాలు తప్పేలా లేవు.నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి దేశ ప్రజల మనోభావాలను కించపరిచేలా స్వాతంత్ర్యం గురించి చేసిన అనుచి వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. గతంలో స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష మాత్రమేనని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై ఎందరో కంగనాపై విరుచుకుపడ్డారు. దేశంలో పలుచోట్ల నిరసనలు సైతం వ్యక్తం చేశారు. ఆఖరికి ఆమెకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని సైతం తిరిగి […]
డిసెంబర్ 15 తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు పున: ప్రారంభం అవుతాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి మరియు ఇతర దేశాలతో షెడ్యూల్ చేయబడిన వాణిజ్య అంతర్జాతీయ విమాన సేవలను పునఃప్రారంభించే విషయాన్ని, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి […]
అమరావతిలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో ఈ సిద్ధాంతాన్ని పాటించలేక పోయామని కానీ ఈసారి దీనిని అమలు చేస్తామన్నారు. ఇక నుంచి పార్టీలో వలసలకు అవకాశం ఉండదన్నారు. ఎన్నికలకు ముందు వాసన పసిగట్టి పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానించేది లేదన్నారు. అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలకు తగినట్టుగా పార్టీ బలోపేతం కావాలని, […]
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆదిలాబాద్ 8 పోలింగ్ స్టేషన్లు మొత్తం 937 ఓటర్లు ఉన్నారన్నారు. ఆదిలాబాద్‌లో ఒక్కో స్థానానికి ఇద్దరూ అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. కరీంనగర్లో 8 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 1324 ఓటర్లు ఉన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది బరిలో ఉన్నట్టు తెలిపారు. మెదక్ 9 పోలింగ్ […]
లింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ శ్రీ.ఆరికేపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటరు రాగం నాగేందర్ యాదవ్ ఆయను మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలపై చర్చించారు. రైల్వే స్టేషన్ లాంజ్‌లో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియా సమావేశంలో రంజిత్‌రెడ్డి మాట్లాడారు. లింగంపల్లి పురాతన రైల్వే అండర్ బ్రిడ్జితో ప్రజలకు చాలా […]
కేసీఆర్ కుటుంబంలో ముఖ్యమంత్రి స్థానంకోసం యుద్ధం మొదలైందన్నారు బీజేపీ నేత విజయశాంతి.. టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించిన ఆమె.. ప్రగతి భవన్లో కుస్తీ ఫైటింగ్ జరుగుతుందన్నారు. కుటుంబ పంచాయతీలతో కేసీఆర్ తల పట్టుకున్నాడని విజయశాంతి అన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో టీఆర్ఎస్ ఉండబోదని జోస్యం చెప్పిన రాములమ్మ.. కేసీఆర్ మోసపు విధానాలు అవలంభిస్తున్నారన్నారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కుటుంబ కొట్లాటల నుంచి రిలీఫ్ కోసం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గురించి […]