భూమిపైన నివశించిన అతి పెద్ద జంతువులు ఏవి అంటే రాక్షసబల్లులు అని చెప్తాం. కోట్ల సంవత్సారాల క్రితం ఈ రాక్షసబల్లులు అంతరించిపోయాయి. ఉల్కలు భూమిని ఢీకొట్టడం వలన జరిగిన ప్రమాదాల వలన డైనోసార్స్ అంతరించిపోయాయి. ఆ తరువాత అడపాదడపా ఉల్కలు భూమీని ఢీకొడుతూనే ఉన్నాయి. అయితే, మనిషి ఆవిర్భవించిన తరువాత టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకున్నాక మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగడుతూ వాటిని ఎదుర్కొంటున్నాడు. Read: యూకే వైపు భారత […]
కరోనా తరువాత చదువు, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఇండియా నుంచి యూకే వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలను ఎత్తివేయడంతో మరింత ఎక్కువ మంది విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు యూరప్ దేశాలు సైతం జానాభాను పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కరోనా సంక్షోభంలో యూరప్ లో భారీ ప్రాణనష్టం సంభవించింది. దీన్ని భర్తీ చేసుకునేందుకు యూరప్ దేశాలు వీసాలను సులభతరం చేసింది. Read: […]
అదృష్టం ఎప్పుడు ఎలా ఎవర్ని తలుపు తడుతుందో చెప్పలేం. అన్ని రోజులు పడిన కష్టం మొత్తం ఒక్కరాత్రితో పటాపంచలైపోతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అందులో ఇదికూడా ఒకటి. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా అంతే గుర్తుకు వచ్చేది వజ్రాల గనులు. హిరాపూర్ తపరియన్ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. నిత్యం వందలాది మంది కూలీలు వజ్రాల కోసం అక్కడ పనిచేస్తుంటారు. ఇందులో పనిచేసే శంశేర్ ఖాన్‌కు గనిలో ఓ వజ్రం దొరికింది. Read: శ్రీవారి సర్వదర్శనం […]
డిసెంబర్ నెలకు సంబంధించి సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఈరోజు ఉదయం 9 గంటలకు టికెట్లను విడుదల చేసింది. ఆన్లైన్లో విడుదల చేసిన 13 నిమిషాల వ్యవధిలోనే 2.80 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. గత మాసంలో 2.40 లక్షల టికెట్లను 19 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందగా, ఇప్పుడు కేవలం 13 నిమిషాల వ్యవధిలోనే 2.80 లక్షల టికెట్లు పొందడం విశేషం. డిసెంబర్ నెలకు సంబంధించి 3.10 లక్షల టికెట్లను టీటీడీ […]
ప్రధాని మోడీ అధ్యక్షతన ఈరోజు ఉదయం 10:30 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి, కీలక అధికారులు హాజరుకాబోతున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపైనే కీలకంగా చర్చించే అవకాశం ఉన్నది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వేరియంట్ లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టు ఇప్పటికే పరిశోధకులు తెలిపారు. Read: 63శాతం పెరిగిన టమోటా ధరలు… ధరల స్థిరీకరణకు… […]
దక్షిణ భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా టమోటా పంట నాశనమైంది. దీంతో టమోటా ధరలు ఎప్పుడూ లేనంతగా భారీగా పెరిగిపోయాయి. దేశంలో టమోటా ధర రూ.67 ఉన్నట్టు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తెలియజేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 63శాతం అధికమని, భారీగా కురుస్తున్న వర్షాల కారణంగానే ధరలు పెరిగినట్టు తెలియజేసింది. ఇక ఉత్తర భారతదేశంలో టమోటాల దిగుబడి డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతాయని, ఈ దిగుబడుల అనంతరం ధరలు […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ లు ఆక్రమించుకున్నాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాలిబన్ ప్రభుత్వంను అధికారికంగా ఏ దేశాలు గుర్తించలేదు. తాలిబన్లకు మిత్రులుగా ఉన్న పాక్, చైనాలు కూడా అధికారికంగా గుర్తించలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో 22 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుండగా, మరో 36 శాతం మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ లు అధికారంలోకి వస్తే పాక్ ప్రాభల్యం పెరుగుతుందని, ఇది పోరుగునున్న భారత్‌కు ఇబ్బందికరమని, ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులకు, […]
కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ కుదిపేస్తున్నది. వివిధ రూపాలుగా మార్పులు చెందుతూ మరింత బలంగా మారి విరుచుకుపడుతున్నది. తాజాగా దక్షిణాఫ్రికాలో బి 1.1.529 వేరియంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఇది ప్రమాదకరమైన వేరియంట్‌గా గుర్తించి దీనికి ఒమిక్రాన్ గా పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నది. దక్షిణాఫ్రికాతో పాటుగా బోట్స్వానా, హాంకాంగ్ దేశాల్లో కనిపించింది. Read: బెంగళూరులో మళ్లీ అదే భయం… ఆందోళనలో […]
కర్ణాటక రాజధాని బెంగళూరులో మళ్లీ వింత శబ్దాలు భయపెడుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి వింత శబ్దాలు రావడంతో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ క్లారిటీ ఇచ్చింది. యుద్ధ విమానాన్ని పరీక్షిస్తున్నప్పుడు వచ్చిన శబ్దంగా చెప్పింది. గతేడాది మేలో వచ్చిన శబ్దాలకు క్లారిటీ ఇచ్చిన హెచ్ఏఎల్, అదే ఏడాది జూన్‌లో వచ్చిన శబ్దాలకు క్లారిటీ ఇవ్వలేదు. ఆ శబ్దాలకు ప్రత్యేక కారణాలు ఏవీ లేవని చెప్పింది. Read: నవంబర్ 27, శనివారం దినఫలాలు… కాగా, ఇప్పుడు మరోసారి బెంగళూరు […]
మేషం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. టెక్నికల్, మెడికల్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. మీ శ్రీమతి నుంచి అన్నివిధాలా ప్రోత్సాహం లభిస్తుంది. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు. వృషభం :- మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు […]