కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్‌కు కష్టాలు తప్పేలా లేవు.నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి దేశ ప్రజల మనోభావాలను కించపరిచేలా స్వాతంత్ర్యం గురించి చేసిన అనుచి వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. గతంలో స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష మాత్రమేనని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై ఎందరో కంగనాపై విరుచుకుపడ్డారు. దేశంలో పలుచోట్ల నిరసనలు సైతం వ్యక్తం చేశారు. ఆఖరికి ఆమెకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని సైతం తిరిగి ఇచ్చివేయాలనే డిమాండ్ క్రమ క్రమంగా పెరిగింది.
ఈ వ్యాఖ్యలపై మొన్న ముంబాయిలో కేసు నమోదు కాగా, తాజాగా హైదరాబాద్‌లో సైతం ఆమె పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్వాతంత్ర్యం పై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల న్యాయవాది కరం కొమిరెడ్డి పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈపిటిషన్‌లో న్యాయవాది కరం కొమిరెడ్డి దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కంగనా వ్యాఖ్యానించారని కోర్టుకు తెలియజేశారు. దీంతో ఈ అంశంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సైఫాబాద్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.