Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. రెండో రోజు వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొత్తం 70,256 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని పరవశించారు. దర్శనంతో పాటు తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. రెండో రోజున 25,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అదే విధంగా భక్తుల విరాళాలతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.79 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు.
New Year Celebrations: జోరుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణపై టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాళ కూడా టోకెన్ కలిగిన భక్తులకే దర్శనానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు దర్శనం సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రేపటి నుంచి టోకెన్ లేకుండా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే ఆన్‌లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు, శ్రీవాణి దర్శన టిక్కెట్లు పొందిన భక్తులకూ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
Swarna Ward: ఏపీలో కీలక నిర్ణయం.. ఇకపై ‘వార్డు సచివాలయం’ కాదు ‘స్వర్ణ వార్డు’
ఇదిలా ఉండగా.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.