ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 ఏళ్ళ కల అది. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావాలని కోరుకున్నారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆదివాసీలు తమ కల సాకారం అయినందుకు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. 30 నివాస సముదాయాలున్న ఆదివాసీ గ్రామం మంగీ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఆర్టీసీ బస్సు శబ్దం వినిపిస్తోంది. రయ్యి రయ్యి మంటూ దూసుకువస్తున్న ప్రజారవాణా వ్యవస్థను అక్కడి మహిళలు, పిల్లలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మంగీ గ్రామ పంచాయతీకి […]
తిరుపతిలోని శ్రీ కృష్ణా నగర్ లో వింత ఘటన చోటుచేసుకుంది. భూమిలో నుంచి పైకి వచ్చింది 25 అడుగుల తాగు నీటి వాటర్ ట్యాంక్.18 సిమెంట్ ఒరలతో భూమిలో నిర్మించారు వాటర్ ట్యాంక్. భూమి లోపల దిగి మహిళ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా ఘటన జరిగింది. ట్యాంకు పరిశీలించారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. భయపడి ట్యాంక్ నుంచి బయట పడింది మహిళ. దీంతో ఆ మహిళకు గాయాలయ్యాయి. ఇప్పటికీ భూమిపై నుంచి పైకి వచ్చి […]
మైనారిటీలకు కూడా అత్యున్నత పదవులు లభిస్తాయని జగన్ మరోసారి నిరూపించారు. ఏపీ శాసన మండలిలో ఓ ముస్లిం మహిళకు డిప్యూటీ ఛైర్ పర్సన్ పదవి కట్టబెట్టారు. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కాసేపు జగన్ తో ముచ్చటించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్గా తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ జకియా ఖానమ్. ఈ సందర్భంగా సీఎం […]
ఎర్రచందనం దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా కడపజిల్లాలో నిన్న అర్ధరాత్రి ప్రొద్దుటూరు ఫారెస్టు అధికారులు,40 మంది తమిళనాడు ఎర్రచందనం కూలీల మధ్య ఛేజింగ్ జరిగింది. ఖాజీపేట మండలం నాగసాయిపల్లె చెక్ పోస్టు వద్ద నుండి ఐచర్ వాహనంలో ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు ప్రొద్దుటూరు ఫారెస్టు అధికారులు. ఫారెస్టు అధికారుల దాడిని తప్పించుకునేందుకు ప్రొద్దుటూరు వైపు ఐచర్ వాహనంలో పరారవుతూ వాహనంలో నుండి దూకి పారిపోయారు 45 మంది తమిళనాడు కూలీలు. బొజ్జవారిపల్లె […]
ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభ ముందుకు రానుంది కాగ్ నివేదిక. మరోవైపు అసెంబ్లీలో సభ్యుల ఫోన్ల అనుమతికి చెక్ చెప్పారు. సభలో సభ్యులు ఫోన్లు తీసుకుని రావడానికి ఇక నుంచి అనుమతి లేదని హౌస్ లో ప్రకటించారు స్పీకర్ తమ్మినేని. చంద్రబాబు ఎపిసోడ్ సమయంలో టీడీపీ సభ్యులు సభలో వీడియో రికార్డు చేయడం వివాదాస్పదమైన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.
మాజీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి పేర్ని నాని. ప్రభుత్వంలో లోపాలు చూపితే సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు మంత్రి పేర్ని నాని. వరద బాధితుల దగ్గరకెళ్లి మీ ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.మా ఆవిడను తిట్టారని వాళ్ళ దగ్గర ఏడుపు ఎందుకు..? మీ శ్రీమతి గారిని మేము ఏమీ అనలేదని లబోదిబోమంటున్నాం. నిన్ను తిడతాం గానీ…మీ ఇంట్లో వాళ్ళను ఎందుకు తిడతాం. టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు ను చీదరించుకుంటున్నారు. మాకూ కుటుంబ సభ్యులున్నారు..మా […]
మైలార్ దేవుపల్లి దుర్గానగర్ చౌరస్తా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధం అయింది. తృటిలో తప్పింది పెను ప్రమాదం. ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు. మైలార్ దేవుపల్లి దుర్గానగర్ చౌరస్తా సమీపంలో కారు వెళుతోంది. అయితే ఆ కారు నడుస్తుండగానే మంటలు చెలరేగాయి. కారు ఇంజన్ లో నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన కార్ డ్రైవర్ ఇక్బాల్ వెంటనే కారు ఆపేశాడు. వెంటనే కారులోంచి బయటకు దిగారు ప్రయాణికులు. కారు […]
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 26. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఇవాళ్టికి 72 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిషర్ల కబంధ హస్తాలనుంచి మనం బయటపడింది ఆగస్టు 15, 1947 .. కానీ మనల్ని మనం పాలించుకునేందుకు ఒక విధానం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది ఆ తర్వాతే. దేశాన్ని ఒకే తాటిపై నడిపించేది రాజ్యాంగం. […]
గ్యాస్ సిలిండర్ లో ఏముంటుంది? ఏంటీ పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ వుంటుంది. ఆయా సిలిండర్ల బరువును బట్టి గ్యాస్ నింపి వుంటుంది. కానీ కొన్ని గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ మాయం అవుతూ వుంటుంది. కానీ గ్యాస్ సిలిండర్లో నీళ్ళు మీరెప్పుడైనా చూశారా. అవును ఇది నిజం, గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడిపై గుదిబండగా మారిన వేళ నీళ్ళు వస్తే ఆ వినియోగదారుడి పరిస్థితి ఎలా వుంటుందో మీరే ఊహించండి. గ్యాస్ బండ […]
ఉదయం9 గంటలకు రాజ్ భవన్ లో 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం. పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు. సభ ముందుకు రానున్న కాగ్ నివేదిక చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. వరద నష్టాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వనున్న ఏడుగురు సభ్యుల బృందం. అమరావతిలో […]