Bihar: హిజాబ్ వివాదం.. విధుల్లో చేరని వైద్యురాలు.. అధికారులు ఏం చేయబోతున్నారంటే..!
- బీహార్‌లో కొనసాగుతున్న హిజాబ్ వివాదం
- ఇంకా విధుల్లో చేరని వైద్యురాలు
- నేడు విధుల్లో చేరకపోతే రద్దు చేస్తామని వార్నింగ్
- ఇప్పటికే బీహార్‌ను విడిచి కోల్‌కతాకు వెళ్లిపోయిన వైద్యురాలు కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో నెలకొన్న హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ వేదికపై నియామక పత్రాలు అందజేశారు. ఆ సందర్భంగా ముస్లిం వైద్యురాలు హిజాబ్ ధరించుకుని వేదికపైకి వచ్చింది. అయితే నితీష్ కుమార్ పత్రాన్ని అందజేసే క్రమంలో వైద్యురాలి హిజాబ్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ఒక మహిళ హిజాబ్‌ను ఎలా తొలగిస్తారంటూ విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత నమోదు
Also Read
ఇదిలా ఉంటే ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్న సదరు వైద్యురాలు నుస్రత్ పర్వీన్ ఇప్పటి వరకు విధుల్లో చేరలేదని అధికారులు వెల్లడించారు. అయితే నియామక పత్రాలు అందుకున్న వైద్యులంతా గురువారంలోపు (జనవరి 1) చేరాలని డెడ్‌లైన్ ఉంది. అది మరికొన్ని గంటల్లో ముగియనుంది. కానీ వైద్యురాలి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఆమె సబల్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లో చేరాల్సి ఉండగా ఎటువంటి సమాచారం లేదని స్థానిక అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Peddireddy Ramachandra Reddy: జగన్ మళ్లీ సీఎం అయితేనే ఆ నిజానిజాలు బయటకు వస్తాయి..
అయితే ఈరోజు గనుక విధుల్లో చేరకపోతే ఆమె అపాయింట్‌మెంట్‌ను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే హిజాబ్ వివాదం తర్వాత వైద్యురాలి కుటుంబం బీహార్‌ను విడిచిపెట్టి పశ్చిమ బెంగాల్‌కు మకాం మార్చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే ఆమె విధుల్లో చేరలేనట్లుగా స్థానిక మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు