లింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ శ్రీ.ఆరికేపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటరు రాగం నాగేందర్ యాదవ్ ఆయను మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలపై చర్చించారు. రైల్వే స్టేషన్ లాంజ్‌లో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియా సమావేశంలో రంజిత్‌రెడ్డి మాట్లాడారు. లింగంపల్లి పురాతన రైల్వే అండర్ బ్రిడ్జితో ప్రజలకు చాలా ఇబ్బందికలుగుతుందన్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండి చాలా సమస్యత్మాకంగా మారుతోందన్నారు. పాత బ్రిడ్జి పక్కన మోడ్రన్ టెక్నాలజీతో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సూచించారు.
లింగంపల్లిలో దుబే కాలనీ లోనీ డ్రైనేజీ సమస్య పై జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకు వచ్చారు. లింగంపల్లి నుండి జైపూర్ వరకు జైపూర్ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించాలని కోరారు. హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ , రాజ్‌కోట ఎక్స్ ప్రెస్, వికారాబాద్ ఎక్స్ ప్రెస్ మరియు గుంటూరు ఎక్స్ ప్రెస్స్ లింగంపల్లి స్టేషన్లో ప్రజల సౌకర్యార్థం కోసం నిలపాల్సిందిగా గజానన్ మాల్యకు విజ్ఞప్తి చేశారు. ప్లాట్ ఫామ్ 2&4 వద్ద ఎక్సలేటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పలు రైల్వే సమస్యలపై చర్చించామని, రైల్వే సమస్యలను తీర్చాలని కోరినట్టు రంజిత్ రెడ్డి తెలిపారు.