ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు రాయలచెరువు లీకేజీలతో తిరుపతి జనం కంటిమీద కునుకులేకుండా పోతోంది. తాజాగా ఓ పాత భవనం కుప్పకూలింది. తిరుపతి భవానీ నగర్ లో కుప్పకూలింది మూడంతస్థుల భవనం. వర్షాలకు పది రోజులుగా పాత భవనం నానిపోయింది. శిథిలావస్ధకు చేరడంతో రెండేళ్ళ క్రితమే ఇంటిని ఖాళీచేశాడు యాజమాని. ఇంటిలో, సమీప ప్రాంతాలలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఇదిలా వుంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. రాత్రి తిరుపతి, శ్రీకాళహస్తి,సత్యవేడు, […]
చలి చంపేస్తోంది. ఉదయం 8 గంటలైనా రోడ్డుమీదికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పెరుగుతున్న చలితో జనం ఇబ్బందిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 11 .3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 11.4 డిగ్రీలు, గిన్నేదారిలో 11 .5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 11.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి లో 12 .7 డిగ్రీలు […]
ఈజీమనీ కోసం దారుణమయిన మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. నమ్మితే చాలు నట్టేటముంచుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చెంబుకి అతీతశక్తులు ఉన్నాయని మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి గుట్టును రట్టుచేశారు. చెంబుకి కెమికల్స్ అద్ది బియ్యాన్ని ఆకర్షించేలా చేసింది రైస్ పుల్లింగ్ ముఠా. దీనిని నమ్మేశారు అమాయక జనం. యూట్యూబ్ లో చూసి మోసాన్ని ఎలా చేయాలో నేర్చుకుంది ముఠా. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఠాను కాంటాక్ట్ చేశారు. అంతే […]
మద్యం మత్తులో కన్నకొడుకు ఫై దాడి చేశాడో తండ్రి. కనికరం లేకుండా కొడుకుని చావబాదాడు. పప్పా.. పప్పా కొట్టొద్దు పప్పా . అంటూ ఓ పసి బాలుడు బ్రతిమిలాడుతూ మంచం కిందికి వెళ్లి దాక్కున్నా, తలగడ అడ్డం పెట్టుకున్నా, కూతురు వద్దు పప్పా అని ప్రాధేయపడుతున్నా కనికరించలేదు. ఆ కర్కోటక కన్న తండ్రికి హృదయం చలించలేదు. రెండున్నర నిమిషాలు ఆగకుండా చేతిలోని కట్టె విరిగేలా ఒళ్లంతా హూనం చేసిన హృదయవిదారక ఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌పరిధిలో చోటు […]
టమోటా ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారలు బెంబేలెత్తున్నారు. గతంలో కేజీ 30 నుంచి 40 వరకు ఉండగా ఇప్పుడు కేజీ టమోటా వంద మార్క్ దాటిపోయింది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటటంతో నెటిజన్లు మీమ్స్ తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. కాగా, ఇప్పుడు టమోటా ధరలు పెట్రోల్ ధరలను మించిపోవడంతో తమ తెలివికి పదునుపెట్టి మీమ్స్ […]
మొబైల్, కంప్యూటర్లలో వినియోగించే చిప్స్‌ను తైవాన్, చైనాలో తయారు చేస్తుంటారు. యూరప్, అమెరికాతో సహా అనేక దేశాలు తైవాన్‌లో తయారు చేసే చిప్ప్ మీదనే ఆధారపడుతున్నాయి. కరోనా కాలంలో వీటి ఉత్పత్తి తగ్గిపోయింది. అంతేకాదు, ప్రపంచ దేశాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో చిప్స్ ఎగుమతులు ఆగిపోయాయి. యాపిల్, గూగుల్ తో పాటు అనేక కంపెనీలు ఇప్పుడు సొంతంగా చిప్స్‌ను తయారు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే సొంతంగా ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. Read: లైవ్: […]
తిరుపతిలో ఇటీవలే భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నగరంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక తిరుపతిలోని కృష్ణానగర్‌లోని ప్రజలు గత రెండు రోజులుగా భయంతో వణికిపోతున్నారు. వర్షాల తరువాత కృష్ణానగర్‌లోని ఓ మహిళ ఇంట్లోని వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి పైకి వచ్చింది. ఈ సంఘటన తరువాత కృష్ణానగర్‌లోని ప్రజలు కంటిమీద కునుకులేకుండా కాలం గడుపుతున్నారు. Read: లైవ్: ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ ఎటు […]