New Year Celebrations: రాష్ట్రంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో సంబరాలు మిన్నంటాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో కుటుంబ సభ్యులతో కలిసి నగర వాసులు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. మరోవైపు ఓపెన్ గార్డెన్స్, క్లబ్బులు, ఈవెంట్ వేదికల్లో నిర్వహిస్తున్న డీజే కార్యక్రమాల్లో యువత డాన్స్ చేస్తూ ఉల్లాసంగా గడిపారు. 2026 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు.
Swarna Ward: ఏపీలో కీలక నిర్ణయం.. ఇకపై ‘వార్డు సచివాలయం’ కాదు ‘స్వర్ణ వార్డు’
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ముందుగానే పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయితే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొందరు నగర వాసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడ్డారు. దీంతో ప్రతి వాహనాన్ని ఆపి బ్రెత్ అనలైజర్ ద్వారా క్షుణ్ణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు పోలీసులు.
Spirit : ఒంటి నిండా గాయాలతో ‘స్పిరిట్’ ప్రభాస్ .. వంగా మార్క్ ఊరమాస్ లుక్!
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులు భారీగా పట్టుబడ్డారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులు లెక్కచేయలేదు. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడ్డారు. పట్టుబడ్డ వారందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న రాత్రి నుండి ఈరోజు తెల్లవారుజాము వరకు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు. ప్రజల భద్రత దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని, మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకూడదని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు.