ఒక స్టార్ హీరో సినిమా ఓటీటీలో వస్తుందంటే ఫ్యాన్స్ థియేటర్ రిలీజ్ కావాలని హంగామా చేయటం మనం చూస్తూ ఉన్నాం. అదీ కాక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో ఆ యా భాషల్లో ఓ మోస్తరు సినిమాలు కూడా థియేటర్ రిలీజ్ కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఐదు సినిమాలు ఏకంగా ఓటీటీలోనే రాబోతుండటం టాక్ ఆఫ్ ద నేషన్ అవుతోంది. అంతే కాదు […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.. ఏపా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 30,831 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 215 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అలాగే తాజాగా ఒక్కరు మృతి చెందారు. ఇదే సమయంలో 406 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కారు. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,97,06,769 కు చేరగా.. మొత్తం పాజిటివ్ […]
బాలీవుడ్ తాజా కండల వీరుడు టైగర్ ష్రాఫ్ లేటెస్ట్ మూవీ ‘గణపత్’ షూటింగ్ శనివారం యు.కె.లో మొదలైంది. ఈ విషయాన్ని హీరో టైగర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీక్వెల్ చిత్రాల హీరోగా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ ఈ సినిమా ప్రారంభానికి ముందే ఇది రెండు భాగాలుగా తెరకెక్కబోతోందని ప్రకటించాడు. వికాశ్ బహల్ దర్శకత్వంలో పూజా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘గణపత్ -1’ చిత్రాన్ని వషు భగ్నానీ నిర్మించబోతున్నాడు. […]
స్టార్ హీరోలు డిజిటల్ ఎంట్రీ కత్తిమీద సాము లాంటిది. ఏమాత్రం అటూ ఇటూ అయినా సోషల్ మీడియా తెగ మోసేస్తుంది. ఈ విషయంలో బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లే. అసలు మెగా ముద్ర పడిన ‘ఆహా’ ఓటీటీకి షో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే బాలయ్య గట్స్ కి నిదర్శనం. ఈ తరహా షో తో ‘ఆహా’పై పడ్డ మెగా ముద్ర నెమ్మది నెమ్మదిగా పోతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవం సినీ రంగానికి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భం విడుదల చేసి మూలవిరాట్ దర్శనం పోస్టర్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయిపోయింది. చిరంజీవి నటిస్తున్న ఈ 154వ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, వి.వి. వినాయక్, పూరి జగన్నాథ్, కొరటాల శివ, ఛార్మి, హరీశ్ […]
భారత జట్టు నిన్న ఆడిన విధంగా అన్ని మ్యాచ్ లలో ఆడితే ఎవరు ఓడించి లేరు అని టీం ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా అన్నారు. అయితే కోహ్లీ సేన నిన్న స్కాట్లాండ్ పైన భావి ఓజయం సాధించిన విషయం తెలిసిందే. దీని పై జడేజా మాట్లాడుతూ… మా నెట్ రన్-రేట్ పెరగాలంటే మేము పెద్ద తేడాతో గెలవాలని అందరికీ తెలుసు.. అందుకే మేము మైదానంలో మా 100 శాతం అందించాలని చూసాము అని జడేజా అన్నారు. […]
సినిమా నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన రంగాలలో ఏషియన్ ఫిలిమ్స్ కొన్నేళ్ళుగా తన సత్తాను చాటుతోంది. అంతేకాదు, పాత సినిమా థియేటర్లను రెన్నోవేట్ చేయడం, కొత్త థియేటర్ల ను నిర్మించడం వంటి కార్యక్రమాన్ని కొంతకాలంగా చేస్తోంది. ఇందులో భాగంగానే ఏషియన్ ఫిలిమ్స్ ప్రిన్స్ మహేశ్ బాబుతో హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘ఎఎంబి’ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ ను నిర్మించింది. అలానే విజయ్ దేవరకొండతో కలిసి మహబూబ్ నగర్ లోనూ మల్టీప్లెక్స్ నిర్మాణం జరిపి, ఇటీవల ప్రారంభించింది. ఐకాన్ స్టార్ అల్లు […]
52వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫీ) ఈ నెల 20 నుండి 28 వరకూ గోవాలో జరుగబోతోంది. ఈ చిత్రోత్సవంలో తెలుగు సినిమా ‘నాట్యం’ను ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ నాట్యాచారిణి సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రంలో నాయికగా నటించి, నిర్మించారు. అక్టోబర్ 22న ఈ సినిమా విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రముఖ దర్శక నిర్మాత రాజేంద్ర సింగ్ బాబు నేతృత్వంలోని కమిటీ ఇఫీకి […]
పశ్చిమ మధ్య బంగాళా ఖాతం దగ్గరలో ని దక్షిణ ఆంధ్ర కోస్తా ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళా ఖాతం దగ్గర లోని దక్షిణ ఆంధ్ర -ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీద ఉన్నది.ఇది సగటు సముద్ర మట్టము నకు 4 .5 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు దాని దగ్గర ఉన్నభూమధ్య రేఖ వద్ద […]