స్టార్ హీరోలు డిజిటల్ ఎంట్రీ కత్తిమీద సాము లాంటిది. ఏమాత్రం అటూ ఇటూ అయినా సోషల్ మీడియా తెగ మోసేస్తుంది. ఈ విషయంలో బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లే. అసలు మెగా ముద్ర పడిన ‘ఆహా’ ఓటీటీకి షో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే బాలయ్య గట్స్ కి నిదర్శనం. ఈ తరహా షో తో ‘ఆహా’పై పడ్డ మెగా ముద్ర నెమ్మది నెమ్మదిగా పోతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విషయంలో అల్లు అరవింద్ స్టాటజీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బాలకృష్ణ అన్నట్లు పొట్టివాడు మహా గట్టివాడే. ఇక బాలకృష్ణ షోతో ఆహాకు ఎలాంటి ప్రయోజనాలను దక్కాయనేది చూద్దాం. సమంత ‘శామ్ జామ్’, రానా ‘నెంబర్ వన్ యారీ’, వైవా హర్ష ‘తమాషా’, మంచులక్ష్మి ‘ఆహా భోజనంబు’, ప్రదీప్ ‘సర్కార్’ వంటి టాక్ షోస్ వల్ల రాని ప్రయోజనాన్ని అల్లు అరవింద్ బాలయ్య టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో పొందారనే చెప్పాలి. అందులో భాగంగా బాలకృష్ణ షో వల్ల ఆమా సభ్యత్వాలు పెరిగాయట. బాలకృష్ణ ఫస్ట్ ఎపిసోడ్‌లో మోహన్‌బాబుతో రాజకీయ,రాజకీయేతర విషయాల గురించి మాట్లాడటం ఆకట్టుకుంది. నిజానికి ప్రోమోతోనే ఆసక్తి రేకెత్తించారు. ప్రోమోలో లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్‌తో పాటు చిరంజీవి, చంద్రబాబును ఉంటంకిస్తూ ప్రోమో కట్ చేయడంతో ఆహా సబ్‌స్క్రిప్షన్స్ బాగా పెరిగినట్లు వార్త. ఫస్ట్ ఎపిసోడ్ తో మోహన్ బాబు, విష్ణు, మంచు లక్ష్మి పాల్గొనటం, అది ఆసక్తికరంగా సాగటంతో రాబోయే ఎపిసోడ్స్ లో అతిథులుగా ఎవరు పాల్గొంటారనే క్యూరియాసిటి పెరిగింది. రానున్న ఎపిసోడ్స్ లో చిరంజీవి-చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి తారలు పాల్గొంటారనే లీక్స్ ‘అన్ స్టాపబుల్’ను మరో రేంజ్ కి తీసుకువెళుతోంది. బాక్సాఫీస్ బొనంజా బాలయ్య ఆహాకు కూడా బంపర్ బొనంజాగా మారారనటంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అరవిందా మజాకానా!?