ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.. ఏపా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 30,831 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 215 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అలాగే తాజాగా ఒక్కరు మృతి చెందారు. ఇదే సమయంలో 406 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కారు. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,97,06,769 కు చేరగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,67,921 కు పెరిగింది. ఇప్పటి వరకు 20,49,961 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,392 మంది ప్రాణాలు తీసింది కరోనా.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,568 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.