పెదగంట్యాడ మండలం గంగవరంలో వెలసిన పెద అమ్మవారు ఆలయంలో కపిలేశ్వరానందగిరి స్వామీజీ నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల కో కన్వీనర్ సునీల్ థియోధర్. అక్కడ ఆయన మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వంలో అవినీతి కారణంగా మత్స్యకారులకు కేంద్రం అమలు చేస్తున్న పథకాలు పూర్తిస్థాయిలో చేరడం లేదన్నారు. నెల్లూరు ప్రాంతంలో డీఎంకే అండ ఉన్న తమిళనాడు ఫిషింగ్ మాఫియా మత్స్యకారుల వలలను నాశనం చేస్తోంది. ఇందులో వైసీపీ నాయకుల పాత్ర ఉంది అని ఆరోపించారు. మత్స్యకారుల సంక్షేమం […]
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22, 657 శాంపిల్స్ పరీక్షించగా.. 178 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 6 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 190 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,03,72,427 […]
భారత స్టార్ టెస్ట్ ఆటగాడు అజింక్య రహానే ఈ మధ్య అంతగా రాణించలేక పోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తున్న రహానే పూర్తిగా విఫలం అయ్యాడు. దాంతో అతని పైన చాలా విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా రహానే ఫామ్ గురించి వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ఫుట్‌వర్క్ అతనికి సమస్యలను కలిగిస్తోందని చెప్పాడు. అతను షాట్ ను ఫ్రెంట్ ఫుట్ పై […]
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022 కి రెండు కొత్త జట్లు రావడంతో మెగా వేలం నిర్వహించనుంది బీసీసీఐ. అయితే ఈ మెగా వేలానికి ముందు ఇప్పటివరకు ఆడుతున్న 8 జట్లు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేయాలనీ ప్రకటించింది. గరిష్టంగా 4 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని ప్రకటించిన బీసీసీఐ… ఆ జాబితాను ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో అన్ని జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నట్లు […]
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. అయితే నిన్న ఆటను రెండో ఇన్నింగ్సులో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి ముగించిన భారత జట్టుకు ఈరోజు కివీస్ బౌలర్లు షాక్ ఇచ్చారు. టాప్ ఆర్డర్ ను త్వరగా కూల్చేశారు. కానీ, ఆ తర్వాత శ్రేయర్ అయ్యర్(65) అర్ధశతకంతో రాణించగా.. అశ్విన్ (32) పరుగులతో ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. వీరివురు ఔట్ అయిన తర్వాత కీపర్ […]
ప్రభుత్వం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.. గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయవద్దని చెప్పాం అన్నారు టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు.. పార్లమెంట్ లో ముందు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశాం. తెలంగాణలో పంట మొత్తం కొనాలి.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ధాన్యం పంట కొనుగోలు గురించి రెండు నెలల్లో 4,5 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు చర్చించారు. చివరికి చేతులు ఎత్తేసి.. […]
భారత జట్టులోని టెస్ట్ స్పెషలిస్ట్ అలాగే నయా వాల్ గా పేరొందిన పుజారా ఈ మధ్య అనుకున్న విధంగా రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో కాన్పూర్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కూడా పుజారా విఫలమయ్యాడు. ఇక ఇదే సమయంలో ఓ చెత్త రికార్డును తన పేరిట నిలుపుకున్నాడు. టెస్ట్ మ్యాచ్ లలో బ్యాటింగ్ ఆర్డర్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేయకుండా అత్యధిక ఇన్నింగ్స్ లలో ఆడిన […]
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ లో తలపడుతున్న భారత జట్టు… అనంతరం సౌతాఫ్రికా పర్యటనకు వెళాల్సి ఉంది. అక్కడ సౌతాఫ్రికా జట్టుతో మూడు ఫార్మాట్లలో తలపడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పర్యటన పై కరోనా నీడలు కమ్ముకున్నాయి. తాజాగా ఈ మధ్యనే సౌతాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ ను కనుగొన్న విషయం తెలిసిందే. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఆ కారణంగానే ప్రస్తుతం అక్కడ సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ […]
“బొమ్మాళీ… నిన్నొదల…” అంటూ గళంతో జనాన్ని జడిపించి, ప్రతినాయక పాత్రలలోనూ భయపెడుతూ సాగుతున్నారు పూడిపెద్ది రవిశంకర్. వారి కుటుంబం మొత్తం గాత్రాన్ని నమ్ముకొని చిత్రసీమలో నిలదొక్కుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన తండ్రి పి.జె.శర్మ వందల చిత్రాలలో నటించారు. అనేక సినిమాల్లో పరభాషా నటులకు గాత్రదానం చేశారు. తండ్రి బాటలోనే పయనిస్తూ రవిశంకర్ అన్న సాయికుమార్ సాగారు. సాయికుమార్ గళంతో సుమన్, రాజశేఖర్ వంటి హీరోలు స్టార్స్ గా చెలామణీ అయ్యారు. అప్పట్లో సాయికుమార్ వాయిస్ ఉందంటే చాలు […]
మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటే ఇదే. కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ. అసలే దాని పరిస్థితి బాగా లేదు. దేశంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడింది. తొలి నుంచి ఈశాన్య భారతం కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఇప్పుడు అక్కడ ఖాళీ అవుతోంది. బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం మేఘాలయ కూడా చేయి దాటి పోయింది. దాంతో ఈశాన్య రాష్ట్రాలలో హస్తం పని అయిపోయింది అనే భావన కలిగిస్తోంది. మేఘాలయలో 17 మంది కాంగ్రెస్ […]