* నేడు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్.. 3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యుల ఎన్నికలు.. 37,562 పోలింగ్ కేంద్రాలు, 56, 19,430 మంది ఓటర్లు.. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు..
* నేడు జీహెచ్ఎంసీ కమిషనర్ తో టీబీజేపీ నేతల సమావేశం.. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అంశంపై చర్చ..
* నేడు ఉదయం 11 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అజెండా అంశాలపై చర్చ, ఆమోదం.. రూ. 169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి రూ. 7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్డీయేకు అనుమతి ఇవ్వనున్న కేబినెట్..
* నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు.. కమిటీల నిర్మాణం, నామినేటెడ్ పోస్టులపై నేతలతో చర్చ.. పార్టీ కమిటీల ఏర్పాట్లపై చంద్రబాబు ఫోకస్..
* నేడు విశాఖలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన..
* నేడు మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి.. టీడీపీ నేతల జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు నవంబర్ 28న ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో పాటు లొంగిపోయేందుకు రెండు వారాల గడువు.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గడువు ముగియనుండటంతో పిన్నెల్లి బ్రదర్స్ లొంగుబాటు..
* నేడు రామగిరి ఎంపీపీ ఎన్నిక.. మూడుసార్లు వాయిదా తర్వాత నాలుగోసారి ఎన్నిక నిర్వహణ..
* నేడు అనంతపురంలో కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల వేడుకలు.. పాల్గొననున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా..
* నేటి నుంచి విజయవాడలో భవనీ మండల దీక్ష విరమణ ప్రారంభం.. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనున్న భవానీ మండల దీక్ష విరమణ.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి 7 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం.. గిరి ప్రదరక్షిణ కోసం 9 కిలోమీటర్ల మార్గాన్ని సిద్ధం చేసిన అధికారులు..
* నేడు కడప మేయర్ ఎన్నిక.. ఉదయం 11 గంటలకు జేసీ సమక్షంలో ప్రత్యేక సమావేశం.. కడప మేయర్ అభ్యర్థిగా పాక సురేశ్.. పాక సురేశ్ కి మెజార్టీ కార్పొరేటర్ల మద్దతు.. ఎన్నికకు హాజరుకావాలని వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ.. మేయర్ ఎన్నికకు దూరంగా టీడీపీ..
* నేడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. 6-8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు..
* నేడు ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోడీ విందు.. సాయంత్రం 6: 30కి ప్రధాని నివాసంలో డిన్నర్..
* నేడు 9వ రోజు పార్లమెంట్ సమావేశాలు.. ఎస్ఐఆర్ పై రాజ్యసభలో చర్చ..
* నేడు టీవీకే ముఖ్య నేతలతో విజయ్ అత్యవసర సమావేశం.. టీవీకేలో చేరికలపై విజయ్ ప్రధాన చర్చ..
* నేడు భారత్- సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. ఛండీగఢ్ వేదికగా రాత్రి 7 గంటలకు టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య సెకండ్ టీ20 మ్యాచ్..