గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కిన సినిమా ‘నయీం డైరీస్’. దీనిని డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వశిష్ఠ సింహ టైటిల్ రోల్ పోషించాడు. సీఏ వరదరాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయన్నది ధైర్యంగా ఈ సినిమాలో చూపించామని దర్శకుడు దాము చెబుతున్నారు. నయీం […]
మనదేశంలో సంగీతప్రియులకు మహదానందం పంచే వాయిద్యాలు ఎన్ని ఉన్నా, వీణ, వేణువు అన్నవి మరింత ఆనందం పంచుతూ ఉంటాయి. ఆ రెండింటి సమ్మేళనంలా వాణీ జయరామ్ గానం ఉంటుందని ప్రతీతి. ఆమె గళంలో జాలువారిన అనేక గీతాలు అమృతం కురిపించాయి. ఉత్తరం, దక్షిణం అన్న తేడా లేకుండా వాణీ జయరామ్ గళం సంగీతాభిమానులను ఎంతగానో పులకింప చేసింది. తెలుగు చిత్రాలతోనే వాణీ జయరామ్ గానం ప్రత్యేకత సంతరించుకుంది. మొత్తం మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా […]
తెలుగు సినిమాలతోనే వెలుగు చూసిన శ్రియా శరణ్ నటిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. తొలిసారి శ్రియ తెరపై కనిపించిన ‘ఇష్టం’ చిత్రం విడుదలై ఇరవై ఏళ్ళవుతోంది. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘ఇష్టం’ ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. అయినా శ్రియ అందం రసికులకు శ్రీగంధం పూసింది. దాంతో దర్శకుడు దశరథ్ తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ‘సంతోషం’లో శ్రియ అందానికి తగిన పాత్రనిచ్చారు. ‘ఇష్టం’ శ్రియకు అయిష్టం కలిగించినా, రెండవ చిత్రం ‘సంతోషం’ టైటిల్ కు తగ్గట్టుగానే సంతోషం […]
స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, డాక్టర్ సంజీవ్ రెడ్డి మండల, టౌన్, బ్లాక్ ప్రెసిడెంట్స్ ,ఎంపీటీసీ, కౌన్సిలర్ లు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ… స్థానిక నేతలకు మంత్రి హరీష్ రావు అపాయింట్ మెంట్ ఇచ్చేవాడే కాదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో పెట్టగానే […]
న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత జట్టు ప్రస్తుతం విజయానికి 9 వికెట్ల దూరంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన శ్రేయర్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్ లో అర్ధ శతకం చేసాడు. ఇలా చేసిన మొదటి భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. ఇక తాజాగా ఈ నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత అయ్యర్ మాట్లాడుతూ… బ్యాటింగ్ కు ముందు కోచ్ రాహుల్ […]
టీటీడీ అధికారులుతో వరుస సమావేశాలు నిర్వహించారు ఈవో జవహర్ రెడ్డి. అయితే విపత్తు సమయంలో భక్తులకు ముందస్తు సూచనలు చేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చెయ్యాలి అని జవహర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ మధ్యే తిరుపతిలో వచ్చిన వరదల గురించి అందరికి తెలిసిందే. ఆ వరదల వల్ల భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇక ఈ వరదల్లో పాడైన ఘాట్ రోడ్లు ,శ్రీవారి మెట్టు నడకమార్గంలో మరమత్తు పనులు వేగవంతంగా నిర్వహించాలి […]
ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమైన ఏపీ ఉద్యోగ సంఘాలు తమ కార్యాచరణ ప్రకటించాయి. ఇక తాజాగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఉద్యమానికి వెళ్లాలని ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తుంది. ఉద్యోగుల కోసం ఆత్మాభిమానం చంపుకుని అందరిదగ్గరకూ తిరిగాం. ఉద్యోగులు దాచుకున్న 1600 కోట్లు ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. దాని పై స్పష్టత ఇవ్వాలి అని అన్నారు. ఉద్యోగ సంఘాలకు విలువ లేకుండా చూస్తున్నారు. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఉద్యోగులను […]
తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల పైనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరి రైతాంగాన్ని ఇబ్బంది పెరుగుతుంది అని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం సమగ్ర విధానం ప్రకటించాలి అని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం పోరాడేందుకు సిద్ధం అని ప్రకటించారు. ఈ విషయంపై కేంద్రాన్ని పార్లమెంటు వేదికగా నిలదీస్తాం అని చెప్పారు. ఉభయసభల్లోనూ మా ఎంపీలు గళమెత్తారు అని అన్న […]
పల్లె దవాఖానలు నాలుగు వేలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. పల్లె దవాఖానలతో గ్రామీణుల చెంతనే నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 5 మెడికల్ కాలేజీలను 17కు పెంచుకుంటున్నాము అని చెప్పారు. పీజీ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లను గణనీయంగా పెంచుకున్నాము అని చెప్పిన ఆయన… గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల వైద్య సేవలు పెంచేందుకు పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ […]
ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమవుతున్నాయి ఏపీ ఉద్యోగ సంఘాలు. పెండింగ్ డీఏ బకాయిలు, పీఆర్సీతో పాటు పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి ఉద్యోగ సంఘాలు. ఇవి నెరవేర్చే వరకు పోరాటానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. వచ్చే నెల నుంచి వివిధ రూపాల్లో నిరసన గళం విప్పనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన సీఎస్ కు నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. డిసెంబర్ 7 నుంచి 10 వరకు అన్ని జిల్లాల్లో బ్లాక్ బ్యాడ్జీలతో […]