గళంతో గడగడలాడించే రవిశంకర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బొమ్మాళీ… నిన్నొదల…” అంటూ గళంతో జనాన్ని జడిపించి, ప్రతినాయక పాత్రలలోనూ భయపెడుతూ సాగుతున్నారు పూడిపెద్ది రవిశంకర్. వారి కుటుంబం మొత్తం గాత్రాన్ని నమ్ముకొని చిత్రసీమలో నిలదొక్కుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన తండ్రి పి.జె.శర్మ వందల చిత్రాలలో నటించారు. అనేక సినిమాల్లో పరభాషా నటులకు గాత్రదానం చేశారు. తండ్రి బాటలోనే పయనిస్తూ రవిశంకర్ అన్న సాయికుమార్ సాగారు. సాయికుమార్ గళంతో సుమన్, రాజశేఖర్ వంటి హీరోలు స్టార్స్ గా చెలామణీ అయ్యారు. అప్పట్లో సాయికుమార్ వాయిస్ ఉందంటే చాలు జనం సైతం ఆసక్తిగా సదరు చిత్రాలను చూసేవారు. ఇక రవిశంకర్ కూడా తన దరికి చేరిన పలు చిత్రాలలో స్వరం వినిపించి ఆకట్టుకున్నారు. ఆ మధ్య తెరకెక్కిన అనేక తెలుగు చిత్రాలలో ప్రధాన ప్రతినాయకులకు రవిశంకర్ గళమే ఆయువు పోసింది.
రవిశంకర్ 1966 నవంబర్ 28న మద్రాసులో జన్మించారు. ఆయన తండ్రి పి.జె.శర్మ వందలాది చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించారు. తల్లి కృష్ణజ్యోతి కూడా ఒకప్పటి నటీమణి. అలా బాల్యం నుంచీ రవిశంకర్ సినిమా వాతావరణంలోనే పెరిగారు. రవిశంకర్ బాలనటునిగా “గోరింటాకు, ఛాలెంజ్ రాముడు, సప్తపది” వంటి చిత్రాలలో నటించారు. అన్న సాయికుమార్ కు కన్నడ చిత్రసీమలో హీరోగా విశేషమైన గుర్తింపు లభించడంతో రవిశంకర్ కూడా అటువైపు సాగిపోయారు. అనేక కన్నడ చిత్రాలలో నటించారు. ఆ తరువాత తెలుగులోనూ రవిశంకర్ కు నటునిగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఓ వైపు నటిస్తూనే మరో వైపు డబ్బింగ్ చెబుతూ సాగారు రవి. దాదాపు 3500 అనువాద చిత్రాలలో రవిశంకర్ గాత్రం వినిపించింది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో మొత్తం 150 చిత్రాలలో రవిశంకర్ నటించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
అనువాద కళాకారునిగా రవిశంకర్ బిజీబిజీగా సాగుతున్నారు. ఏడు సార్లు బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డులు అందుకున్నారు రవిశంకర్. జూనియర్ యన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’లో ప్రధాన ప్రతినాయకునిగా కనిపించిన రవిశంకర్, ఈ యేడాది ‘క్రాక్’లో ఓ కామెడీ రోల్ లో అలరించారు. అంతకు ముందు మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించారు. చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ‘భోళాశంకర్’లోనూ రవిశంకర్ ఓ కీ రోల్ పోషిస్తున్నారు. కేవలం అనువాద కళాకారునిగా గాత్రం పలికించడమే కాదు, కొన్ని చిత్రాలలో తన గళాన్నీ వినిపిస్తూ పాటలు పాడారు రవిశంకర్. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ రెండు భాగాల్లోనూ రవిశంకర్ గాయకునిగా అలరించారు. “బెజవాడ, వంగవీటి, రాజరథం” వంటి చిత్రాలలోనూ రవిశంకర్ పాటలు పాడారు.
రవిశంకర్ భార్య పంజాబీ. పేరు సుచిల్. ఈ దంపతులకు అద్వేయ్ అనే కుమారుడు ఉన్నాడు. తన తనయుణ్ణి నటునిగా స్వీయ దర్శకత్వంలో పరిచయం చేస్తానని రవిశంకర్ అప్పట్లో ప్రకటించారు. 2004లో ‘దుర్గి’ అనే కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించారు రవిశంకర్. ఈ చిత్రం తెలుగులో జూనియర్ యన్టీఆర్ హీరోగా ‘నరసింహుడు’ పేరుతో రూపొందింది. మాతృభాష తెలుగులోనే కాదు పరభాషల్లోనూ రవిశంకర్ తన అభినయంతోనూ, గాత్రంతోనూ ఆకట్టుకుంటూ సాగుతున్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!