AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ( డిసెంబర్ 11న) ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అజెండాలోని పలు కీలక అంశాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలపనున్నారు. రు. 169 కోట్లతో లోక్ భవన్ (గవర్నర్ బంగ్లా) నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే, జ్యుడిషియల్ అకాడమీకి రూ. 163 కోట్లతో పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలపనున్నారు. 2024- 25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలియజేయనుంది. ఇక, నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి 7380.70 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు CRDAకి కేబినెట్ అనుమతి ఇవ్వనుంది.
Read Also: Akhanda-2 : ‘అఖండ 2’ తాండవం మొదలైంది.. గంటలోనే 18.5K టికెట్లు బుక్!
అలాగే, సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధించే పనులకు 532 కోట్ల రూపాయల మేర ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రూ. 20 వేల కోట్లు పెట్టుబడులు, 56 వేల ఉద్యోగాలు కల్పనకు మంత్రి మండలి ఆమోదం తెలయజేయనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు పర్మిషన్ ఇవ్వనుంది. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.