పాత రోత.. కొత్త వింత..! తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఇదే ఫాలో అవుతున్నారా? ‘కొత్త’ పెత్తనాలపై ‘పాత’వాళ్లు చిటపటలాడుతున్నారా? వెంట కేడర్ లేకుండా సింగిల్‌గా వచ్చి.. కాషాయ కండువా కప్పుకొంటున్న లీడర్ల తీరుపై ‘ఓల్డ్’ బీజేపీ నేతల అభ్యంతరాలేంటి? ఈ అంశంపై కమలదళంలో ప్రశ్నల పరంపర మొదలైందా? లెట్స్ వాచ్..! గట్టిగానే సౌండ్ చేస్తోన్న ఓల్డ్ బీజేపీ నేతల ప్రశ్నలు..! మొదటి నుంచి జెండాలు మోసేది మేము..! మాపై పెత్తనం చేసేది కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులా? […]
పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టడం వెనక ఉన్నది ఆయనేనా? తన డిమాండ్స్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిప్పు రాజేశారా? ఏపీ సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్..! అనూహ్యంగా సలహాదారు పోస్ట్ చేపట్టిన ఉద్యోగ సంఘాల మాజీ నేత..! చంద్రశేఖర్‌రెడ్డి. ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారు. సర్కార్ పిలిచి మరీ ఆయనకు పీట వేసింది ప్రభుత్వం. రెండేళ్ల పదవీకాలంతో ఉద్యోగుల సంక్షేమం చూసుకునేలా ప్రభుత్వ సలహాదారుగా […]
అసెంబ్లీలో నన్ను ఎగతాళి చేశారు.. అవమానాలకు గురి చేశారు.. అయినా భరించాను. చివరకు కుటుంబ సభ్యులను కూడా దూషించారు.. గౌరవాన్ని దెబ్బతీశారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని మళ్లీ సీఎంగా వస్తానని సవాల్ విసిరి వచ్చేశాను. నేను సీఎంగా ఉన్నాను.. ప్రతిపక్ష నేతగా పని చేశాను. నేనూ మనిషినే.. భార్యకు భర్తనే. నేనెప్పుడూ ఇంట్లో ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రజల ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు డాక్యుమెంట్లు […]
ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఒడ్డు దిగాక బోడి మల్లన్న. ప్రస్తుతం ఆ నగరంలో మున్సిపల్ కార్పొరేటర్ల తీరు అలాగే ఉందట. ఎన్నికల్లో గెలిచేదాకా.. స్థానికులకు అనేక హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే.. అంతా గాయబ్. ఎందుకిలా? వరదల టైమ్‌లో వైసీపీ కార్పొరేటర్లు ఏమయ్యారు? వరదలకు తిరుపతి మునిగిపోయింది. రోజులు గడుస్తున్నా నగరంలోని చాలా ప్రాంతాలు నీటిలోనే నానుతున్న పరిస్థితి. ప్రజలు హాహాకారాలు పెడుతుంటే.. తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్ల తీరు విమర్శలకు […]
తెలంగాణ కరోనా కేసులు ఈరోజు కొంచెం పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 36,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 189 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఇద్దరు కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 137 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,376 కి చేరగా.. రికవరీ […]
గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు జరిగిన విధానంపై కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోన్నారు చంద్రబాబు. ఈ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రాత్రి పూట వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపే అలవాటును కొందరు టీడీపీ నేతలు మానుకోవాలి. నేను చచ్చినా.. నువ్వు చచ్చినా పార్టీ జండా కప్పుతారు ప్రాణాల కోసం వైసీపీ వాళ్ళతో రాత్రిళ్లు మాట్లాడుతారా..!? ఆ అవసరం లేదు అని తెలిపారు. 2014- […]
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ తగ్గింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 29,263 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 159 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందరు. ఇదే సమయంలో 169 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,04,75,940 కు చేరింది.. మొత్తం […]
ఇటీవల విడుదలైన ‘పుష్పక విమానం’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘హైవే’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూర్తిగా సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇందులో మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2 గా వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో […]
సాప్ట్ వేర్ ఇంజనీర్ నుంచి నటుడుగా మారిన రఘు కారుమంచి ఇప్పుడు మరో బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. 2002లో ‘ఆది’తో నటుడు అయిన రఘు ఆ తర్వాత పలు చిత్రాలలో హాస్య పాత్రలతో అలరించటమే కాదు జబర్ దస్త్ షోలో రోలర్ రఘుగా టీమ్ లీడ్ చేశాడు. కరోనా టైమ్ లో ఫార్మింగ్ మీద దృష్టి పెట్టి సమర్థవంతంగా వ్యవసాయం చేస్తూ వచ్చాడు రఘు కారుమంచి. ఇప్పుడు అనుకోకుండా మిత్రులతో కలసి మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. […]
ప్రముఖ కథానాయకుడు చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘మహాన్’ చిత్రంలో నటిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విక్రమ్ తో పాటు ఆయన కుమారుడు ధృవ్ కథానాయకుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విక్రమ్ 61వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, స్టూడియో గ్రీన్ అధినేత కె. ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. గతంలో సూర్య, కార్తీతో సినిమాలు తీసిన వారి సన్నిహితుడైన జ్ఞానవేల్ రాజా కొంతకాలంగా ఇతర కథానాయకులతోనూ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విక్రమ్ తో […]